EPAPER

Ayyappa Swamulu : ప్రకృతి పెట్టే పరీక్షలో గెలిచే అయ్యప్ప స్వాములు

Ayyappa Swamulu : ప్రకృతి పెట్టే పరీక్షలో గెలిచే అయ్యప్ప స్వాములు
Ayyappa Swamulu

Ayyappa Swamulu : హరి, శివునిల కుమారుడు అయ్యప్ప. 41 రోజుల దీక్ష ధరించి 18 మెట్లను ఎక్కి అయ్యప్పని చూసేందుకు పట్టే దీక్ష కాదు ఇది. భౌతిక సుఖాలను కాదనుకుని, ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి, స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం.


బ్రహ్మముహూర్తంలో స్నానం:
మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానమాచరించి సూర్యోదయం కాకముందే పూజనుముగించాలి. చన్నీళ్లతో తలస్నానంతో రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి- వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని అలవర్చుకోవడం.

శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్తప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీళ్లు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్తప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే రక్తప్రసరణ వేగాన్ని అందుకుంటుంది. అప్పటివరకూ మందగించిన రక్తప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలోని చిన్నపాటి దోషాలు తొలగిపోతాయి.


క్షవరం నిషేధం
దీక్షలో ఉన్నన్నాళ్లూ స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. శరీరాన్ని గారాబంగా చూసుకుని, దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించిన రోజున దాని పట్ల ఎంత శ్రద్ధ వహించాలో అంతే ప్రాముఖ్యతను ఇస్తాం. దాన్ని గుర్తుచేసేదే ఈ నియమం!

నల్లబట్టల రహస్యం
తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే, నలుపు రంగు వేడిని ఆకర్షిస్తుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తుంది. కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక! దీక్ష కొనసాగినన్నాళ్లూ తాము స్వాములుగా ఉంటామనీ, వైరాగ్యానికి ప్రతినిధులుగా కొనసాగుతామనీ సూచించే నలుపు రంగు వస్త్రాలను అయ్యప్పలు ధరిస్తారు.

కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్టజాతకంగా భావిస్తారు. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం. అన్ని కష్టాలనూ తట్టుకుని, అన్ని అడ్డంకులనూ దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా, సన్నద్ధంగా ఉండాలి. అందుకోసం కొంత కఠినత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. అందుకే అయ్యప్పమాలధారులు పాదరక్షల నిషేధం వెనుక భావన ఇదే.

మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలు ఉన్నాయి.ఆధ్యాత్మిక పురోగతికీ, భౌతిక దృఢత్వానికీ నిర్దేశించినవే! అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు, ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు, మళ్లీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తారు.

Related News

Lucky moles: ధనవంతుల్ని చేసే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా? ఇప్పుడే చెక్ చేసుకోండి

Horoscope 18 october 2024: ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ.. శనిశ్లోకం చదివితే శుభఫలితాలు!

Diwali Vastu Tips: దీపావళి రోజున శ్రేయస్సు కావాలని కోరుకుంటే వెంటనే ఇంట్లో నుండి ఈ వస్తువులను తొలగించండి

Karwa Chauth Vrat: ఈ స్త్రీలు కర్వా చౌత్ ఉపవాసాన్ని అసలు పాటించకూడదు..

Vastu Shastra: ఇంట్లో ఈ 5 విగ్రహాలు ఉంటే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది !

Kartik Month 2024 Festival List: రాబోయే 30 రోజులలో వచ్చే పండుగలు, ఉపవాసాలు జాబితా ఇవే

Shani Margi 2024: శని ప్రత్యక్ష సంచారంతో ఈ రాశుల వారి జీవితంలో అత్యంత పురోగతి

Big Stories

×