EPAPER

‘Election bonds’ are unconstitutional: ‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం!

‘Election bonds’ are unconstitutional: ‘ఎన్నికల బాండ్లు’ రాజ్యాంగ విరుద్ధం.. సుప్రీం తీర్పుపై కాంగ్రెస్ హర్షం!

Supreme Court comments on Election Bonds: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఈసీ తీరుపై విమర్శంచింది. ఈ విమర్వలకు రాహుల్‌ గాంధీ స్పందించారు. ఎన్నికల బాండ్లను మోదీ సర్కారు కమీషన్లకు మాధ్యమంగా మార్చేసిందని ఆయన అన్నారు. ఇది ఈ రోజు కోర్టులో రుజువైందన్నారు.


కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్‌లో స్పందిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎన్నికల బాండ్ల పథకం.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాకుండ, పార్టమెంట్‌ ఆమోదించిన రెండు చట్టాలను కూడా ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. నోట్ల కంటే ఓట్లకే ఎక్కువ శక్తి ఉంటుంది అనే వాస్తవాన్ని ఈ తీర్పు బలపర్చిందన్నారు. దీన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతిస్తుందన్నారు.

చందాలిచ్చే దాతలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తు.. మోదీ ప్రభుత్వం అన్నదాతలకు పదే పదే అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది నిజమైతే.. రాజకీయ పార్టీలతో సమావేశమయ్యే విషయంలో ఈసీ ఎందుకింత మొండితనంగా వ్యవహరిస్తుందని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్ల సమస్యలపై రాజకీయ పార్టీలతో ఈసీ ఎందుకు సమావేశం కావడం లేదు అన్నారు. ఈ అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని విశ్వాసిస్తునట్లు తెలిపారు.


Read More: తెనాలిలో వివాహిత హత్య.. గొంతు కోసి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎన్నికల బాండ్ల పథకం సమాచార హక్కు, ఆదాయపు పన్ను చట్టాలను ఉల్లంఘిస్తోందని పేర్కొంది. దీంతో ఇది క్విడ్‌ ప్రోకోకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే ఎన్నికల బాండ్ల జారీని ఎస్‌బీఐ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారి చేసింది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×