EPAPER

Man Shoot Dead: MRI మెషిన్‌లోకి తుపాకితో వెళ్ళిన వ్యక్తి.. తరువాత ఏం జరిగిందంటే..?

Man Shoot Dead: MRI మెషిన్‌లోకి తుపాకితో వెళ్ళిన వ్యక్తి.. తరువాత ఏం జరిగిందంటే..?

Man Dies After Taking Loaded Gun Inside MRI Scan Room: పూర్వ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా చాలా తక్కువ వైద్య యంత్రాలు ఉండేవి. అలాంటి సమయంలో ప్రజల వ్యాధులు గుర్తించలేక సరైన వైద్యం అందక చనిపోయేవారు. కానీ, సమయంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక్క ఆరోగ్య సమస్యను తేల్చి చెప్పేందుకు యంత్రాలు వచ్చాయి. వాటి సహాయంతోనే డాక్టర్లు నిమిషాల్లో వ్యాధులను గుర్తించి చికిత్స చేస్తున్నారు.


అలాంటి యంత్రాల్లో ఒక యంత్రమే అయస్కాంత తరంగాల చిత్రిక (MRI). ఈ యంత్రం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క చిన్న రోగాన్ని బయటపెట్టడంలో ఉపయోగకరంగా ఉండడమే కాదు, చాలా ప్రమాదకరమైనది కూడా. ఒక్కో సమయంలో ఇది ప్రాణాలను కూడా తీస్తుంది. ఇలాంటి ఒక భయానక ఘటనే బ్రెజిల్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

MRI స్కాన్ తీసే సమయంలో ఈ యంత్రం లోపల మెటల్ సంబంధిత వస్తువులను తీసుకెళ్లడానీ నిషేధించారు. గడియారాల నుంచి చిన్న పాటి నగలు మొదలైనవన్నీ బయట తీసేసి తర్వాత లోపలికి వెళతారు. మెటల్ వస్తువులను లోపలికి తీసుకువేళ్లడం ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.


40 ఏళ్ల బ్రెజిలియన్ లాయర్ లియాండ్రో మథియాస్ డి నోవ్స్ కూడా ఇలాంటి నిర్లక్ష్యానికి పాల్పడి ప్రాణాలను కొల్పోయాడు. అతను లోడ్ చేసిన తుపాకీతో MRI యంత్రం లోపలికి వెళ్ళాడు. లాడ్ బైబిల్ (LadBible) నివేదిక ప్రకారం MRI యంత్రం అయస్కాంత శక్తి కారణంగా, లియాండ్రో తుపాకీ అతని నడుము నుండి వేరు అయి బుల్లెట్ నేరుగా అతని కడుపులోకి వెళ్లి ఆ వ్యక్తి మృతి చెందాడు. ఈ దారుణ ఘటన ఫిబ్రవరి 6వ తేదీన జరిగింది.

మియామీ హెరాల్డ్ ప్రకారం.. పరీక్ష నిర్వహించే గదిలోకి ప్రవేశించే ముందు రోగికి వారితో పాటు ఉన్న తల్లికి సరైన సూచనలు ఇచ్చారు. లోహంతో చేసిన వస్తువులు ఏమైనా ఉంటే తీసేయాలని హెచ్చరించారు. అయినా లియాండ్రో తుపాకీతో యంత్రం లోపలికి వెళ్లారు. దీంతో అతని ప్రాణాలు కోల్పోయాడు.

ఇలాంటి ఘటనలు గతంలో అమెరికాలో కూడా చోటుచేసుకుంది. MRI యంత్రంలోకి తుపాకీని తీసుకెళ్లడం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఘటన మొదటిది కాదు. గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాకు చెందిన ఒ మహిళ కూడా ఇలాగే ప్రాణాల మీదికి తెచ్చుకుంది. తను కూడా లోడ్ చేసిన తుపాకీతో యంత్రం లోపలికి వెళ్లింది. MRI యంత్రాన్ని ప్రారంభించిన వెంటనే ఆమె తుపాకి రియాక్ట్ అయి తుంటికి నేరుగా బుల్లెట్ తగిలింది. ఈ హృదయ విదారక ఘటనలో ఆమె ప్రాణాలు దక్కినప్పటికీ, లియాండ్రో కడుపులో బుల్లెట్ వెళ్లడంతో ప్రాణాలను కాపాడుకోలేకపోయారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×