EPAPER

Special Mango Recipes for Summer: మామిడి పండ్లతో వేసవిని ఎంజాయ్ చేయండి..!

Special Mango Recipes for Summer: మామిడి పండ్లతో వేసవిని ఎంజాయ్ చేయండి..!

Mango Recipes for Summer : మామిడి.. పండ్లలో రారాజుగా దీనిని పిలుస్తారు. మామిడిలో బంగినపల్లి ఎంతో ఫేమస్. సమ్మర్‌లో మాత్రమే ఈ పండ్లు దొరుకుతాయి. కాబట్టి ఈ సమ్మర్‌లో ఈ పండ్ల రుచిని ఆస్వాదించాల్సిందే. సమ్మర్‌లో చల్లగా, రిఫ్రెష్‌గా ఉండటానికి మామిడి పండ్లతో జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మామిడిలో ఉండే తీపి, క్రీమీనెస్ నోరూరిస్తాయి.


ఈ పండ్లతో డ్రింక్స్, డెజర్ట్‌లు, స్మూతీలు వివిధ రకాలుగా చేసుకోవచ్చు. మామిడిలో మిటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లతో రూపొందించగల అద్భుతమైన రెసిపీలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాంగో స్మూతీ


మామడి పండు ముక్కలను పాలు, పెరుగు, కొబ్బరి నీళ్లతో కలపండి. దానికి కాస్త స్వీటెనర్‌ను జోడించండి. ఇక సులభంగా మ్యాంగో స్మూతీ రెడీ అవుతుంది. మీకు మ్యాంగో స్మూతీ చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్‌లను దానిలో కలపండి.

మ్యాంగో లస్సీ

మామిడి పండు గుజ్జును.. పెరుగు, పంచదార, యాలకుల పొడితే కలపండి. అది మృదువుగా వచ్చే వరకు బ్లెండ్ చేయండి. మీకు మరింత రుచిగా కావాలంటే దానిలో బాదం పప్పు లేదా పిస్తాపప్పులు వేయండి. చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్‌లు వేసుకొని తాగండి.

Read More: సమ్మర్.. ఈ బెడ్‌షీట్స్‌తో చల్లగా నిద్రపోండి..!

మ్యాంగో ఐస్‌డీ

మ్యాంగో ఐస్ డీ తయారీ చాలా సులభం. మొదటగా కొన్ని నీళ్లలో టీ పొడి వేసి డికాక్షన్ చేయండి. తర్వాత దానిని చల్లబరచండి. ఆపై దానిలో మామిడి రసం, ఐస్ క్యూబ్స్ కలపండి. మ్యాంగో ఐస్ డీ రెడీ అయినట్లే. మరింత టేస్ట్ కోసం స్వీటెనర్ కలుపుకోవచ్చు.

మ్యాంగో ఐస్ డీ కాఫీ

మ్యాంగో ఐస్ డీ కాఫీ తయారీ కోసం.. ఒక స్ట్రాంగ్ కప్ కాఫీని బ్రూ చేసి చల్లబరచండి. తర్వాత బ్లెండర్‌లో చల్లబడిన కాఫీ, మామిడి ముక్కలు, పాలు వేసి కలపండి.

Read More: సమ్మర్.. ఈ సీడ్స్‌తో వేడి తగ్గించేయండి..!

మ్యాంగో మోజిటో

ఒక గ్లాసులో నిమ్మకాయ ముక్కలు, కొన్ని పుదీనా ఆకులను వేయండి. దానిలో మామిడి పండు రసం, సోడా నీరు, ఐస్ క్యూబ్స్ వేసి కలపండి. మరింత రుచి కావాలంటే స్వీటెనర్ కలుపుకోవచ్చు. దానిని మెల్లగా కలుపుతూ.. పుదీనా రెమ్మతో అలంకరిస్తే మ్యాంగో మోజిటో రెడీ.

మ్యాంగో మార్గరీటా

మ్యాంగో మార్గరిటా చేయడం కోసం.. ఒక బ్లెండర్‌లో మామిడి పండ్ల ముక్కలు, టేకిలా, నిమ్మరసం, కాస్త ఆరెంజ్ లిక్కర్ కలపండి. దీనిని సాల్ట్-రిమ్డ్ గ్లాసుల్లో పోయాలి. అనంతరం నిమ్మకాయ ముక్క లేదా మామిడికాయ ముక్కతో దానిని అలంకరించండి.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×