EPAPER

BIG Shock to CM Jagan: సీఎం జగన్ కి షాక్ తగలనుందా..? వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?

BIG Shock to CM Jagan: సీఎం జగన్ కి షాక్ తగలనుందా..? వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?
Political news in AP

BIG Shock to CM Jagan(Political news in AP): వైనాట్ 175 అంటున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోలుకోలేని షాక్ తగలనుందా? గత రెండు ఎన్నికల్లో అండగా ఉంటూ వచ్చిన బిగ్‌షాట్ వైసీపీతో తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయ్యారా? చకచకా మారిపోతున్న పరిణామాలు చూస్తుంటే దానికి అవుననే సమాధానం వస్తోంది. ఆయనేమీ ఆషామాషీ నేత కాదు. దివంగత వైఎస్ అభిమానిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. వైసీపీ పవర్‌లోకి రావడంలో కీ రోల్ పోషించిన లీడర్.. ఆయన వస్తానంటే ఏ పార్టీ అయినా రెడ్ కార్పెట్ పరుస్తుంది. అలాంటి కార్పొరేట్ నాయకుడ్ని జగన్ ఒక ఎమ్మెల్యే సీటు విషయంలో ఇబ్బంది పెట్టి.. దూరం చేసుకుంటున్నారంట.. ఇప్పుడా లీడర్ ఏ పార్టీలో చేరి చక్రం తిప్పుతారనే ఆసక్తికరంగా తయారైంది. ఇంతకీ ఎవరాయన? ఆయన బలం ఎంటో?. మీరే చూడండి.


వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా రిటైర్ కానున్న ఆయన.. నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసిస్తుంటారు. గత ఎన్నికల్లో వేమిరెడ్డి అండదండలతో వైసీపీ ఆ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయగలిగింది. అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలు గెలుచుకుని టీడీపీకి జిల్లా నుంచి ప్రాతినిధ్యమే లేకుండా చేసింది. అదంతా వేమిరెడ్డి చలవే అని నెల్లూరు వైసీపీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటుంటారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేశారు. వీపీఆర్ మైనింగ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన వేమిరెడ్డి.. ప్రజలకు చేరువ కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 2015లో నెల్లూరులో వీపీఆర్ వికాస్, వీపీఆర్ విద్య, వీపీఆర్ వైద్య పేర్లతో ఫౌండేషన్లు ఏర్పాటు చేసి.. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.


బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన వేమిరెడ్డి.. తనకున్న పరిచయాలతో.. 2014 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పార్టీ అభిమానుల నుంచి వైసీపీ ఫండ్స్ రెయిజ్ చేసిపెట్టారంటారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి మొదట్లేనే రాజ్యసభ స్థానం దక్కేదన్న టాక్ ఉంది. పార్టీ ఓడిపోవడంతో వేమిరెడ్డిని పక్కన పెట్టిన జగన్.. 2016లో విజయ సాయిరెడ్డిని రాజ్యసభకు పంపారు.

దాంతో జగన్‌పై కినుక వహించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఆ ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ముందే వైసీపీకి దూరమయ్యారు. ఈ సమయంలో ఆయన టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని వేమిరెడ్డి షరతు పెట్టారు. అవసరం అయితే విజయసాయి పోటీ చేస్తున్న మూడో స్థానానికి పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించినా.. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి ఆ తరువాత ఆలోచిద్దాం అనడంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తర్వాత 2018లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వడంతో.. జగన్ వేమిరెడ్డి పిలిచి మరీ రాజ్యసభకు పంపారు.

Read More:  అమరావతిపై జగన్ యూటర్న్ .. అంతుపట్టని రాజధాని వైఖరి..

రాజ్యసభ సభ్యుడిగా నెల్లూరు జిల్లా వైసీపీ భారాన్ని భుజానికెత్తుకున్న వేమిరెడ్డి 2019 ఎన్నికల్లో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిపెట్టి.. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడేలా కృషి చేశారన్న టాక్ ఉంది. తర్వాత మారుతున్న పరిణామాలతో.. వేమిరెడ్డిని రానున్న ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధ్యక్షుడు నిర్ణయించారు. ముందు తటపటాయించినా.. తర్వాత షరతులతో దానికి ఒప్పుకున్నారాయన. నెల్లూరు ఎంపీ సీటు పరిధిలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారు.

ముఖ్యంగా నెల్లూరు సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ని మార్చి తీరాల్సిందేనని ఆయన పట్టుబట్టారంట. దాంతో అనిల్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా షిఫ్ట్ అయ్యారు. ఆ క్రమంలో నెల్లూరు సిటీ సీటుని తాను సూచించిన అభ్యర్ధికే కేటాయిస్తారని వేమిరెడ్డి భావించారు. ఆ నమ్మకంతోనే తన భార్య ప్రశాంతిరెడ్డి పేరుతో పాటు, మరో వ్యాపారవేత్త పేరును ప్రతిపాదించారు. అయితే అక్కడే నెల్లూరు రాజకీయం మారిపోయింది. వైసీపీలో కుదుపుకు కారణమైంది.

వేమిరెడ్డి ప్రతిపాదనలను పక్కన పడేసిన వైసీపీ పెద్దలు.. నెల్లూరు సిటీ అభ్యర్థిగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్‌ను ఖరారు చేశారు. ఖలీల్ అహ్మద్ అనిల్‌యాదవ్ అనుచరుడు.. ఆ మాజీ మంత్రే ఖలీల్ అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయించారు. దాంతో జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్న వేమిరెడ్డి హర్ట్ అయ్యారు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌ అయిన తనకు మాట కూడా చెప్పకుండా నెల్లూరు సిటీ అభ్యర్ధిని ఖరారు చేయడంతో.. ఫ్యామిలీతో కలిసి జిల్లానుంచి సడన్‌గా మాయం అయిపోయారు.

నెల్లూరు ఎంపీగా పోటీ చేయనున్న తనని.. ఖలీల్‌ గురించి ఎలాంటి అభిప్రాయం అడగకుండా.. కేండెట్‌గా ప్రకటించడాన్ని అవమానంగా భావించిన వేమిరెడ్డి.. అప్పటినుంచి అలకబూనారు. వైసిపి నాయకులకు.. తన అనుచరులకూ.. ఎవరికి అందు బాటులో లేకుండా సైలెంట్ అయిపోయారు. వైసిపి ముఖ్య నాయకులు ఫోన్లు చేసినా స్పందించడం లేదంట. అయితే తర్వాత రాజ్యసభ సమావేశాల్లో కనిపించారు. పార్లమెంట్ సమావేశాల టైంలో అక్కడకి వెళ్లిన జగన్‌కు ముఖం చాటేశారంట.

మరోవైపు అటు వైసిపి రాష్ట్ర నాయకులు వేమిరెడ్డిని మళ్లీ బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వేమిరెడ్డి మాత్రం మెట్టు దిగడం లేదంట. ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. వైసీపీలోనే కొనసాగుతారా.. లేక పార్టీ మారతారా అని అటు రాజకీయ వర్గా ల్లోనూ.. వైసీపీలోనూ.. ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీపై అసంతృప్తితో తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. మరోవైపు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది.

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీ నుంచి బయటకు వెళ్లడంతో.. ఆదాలరి నెల్లూరు రూరల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ, ఈయన టీడీపీలోకి వెళ్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా తాను వైసీపీని వీడటం లేదని స్పష్టం చేసిన నెల్లూరు ఎంపీ.. వేమిరెడ్డి, మాగుంటలు తమ పార్టీపై ఆగ్రహంతో ఉన్నట్లు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వైసీపీపై ఆగ్రహంతో ఉన్న వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీడీపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్ళారని.. అటు బీజేపీ నాయకులు కూడా వేమిరెడ్డితో చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారడం పక్కా అన్న అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడుని కలిసినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి బరిలోకి దిగే దిశగా వారి చర్చలు జరిగాయంట.

అలాగే వేమిరెడ్డి సతీమణి ప్రశాంతికి కూడా కోవూరు టీడీపీ టికెట్ కన్‌ఫర్మ్‌ అయిదంటున్నారు. మరోవైపు బీజేపీ ముఖ్య నేతలు కూడా ఎంపీ వేమిరెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా.. ఆయన సైకిల్ ఎక్కేందుకే సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు కూడా వేమిరెడ్డి వెంట సైకిల్ ఎక్కడానికి సిద్దంగా ఉన్నారంట. మంచి రోజు చూసుకొని అతి త్వరలోనే వేమిరెడ్డి ఆయన టీం పసుపు కండువా కప్పుకుంటారంటున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలని దూరం చేసుకున్న వైసీపీకి. వేమిరెడ్డి కూడా దూరమైతే కోలుకోలేని దెబ్బే అంటున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×