EPAPER

Jagan Uturn on Amaravati: అమరావతిపై జగన్ యూటర్న్ .. అంతుపట్టని రాజధాని వైఖరి..

Jagan Uturn on Amaravati: అమరావతిపై జగన్ యూటర్న్ .. అంతుపట్టని రాజధాని వైఖరి..
ys jagan news today

Jagan Uturn on Amaravati(Latest news in Andhra Pradesh): మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్దిని వైసీపీ అటకెక్కించిందన్న విమర్శలున్నాయి. పాలన వికేంద్రీకరణ, రాష్ట్ర సమగ్రాభివృద్ది అంటూ తెగ హడావుడి చేసినా.. నాలుగేళ్ల నుంచి ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. ఆ ఎఫెక్ట్‌తో ఏపీకి రాజధానే లేకుండా చేసిందనే అప్రతిష్ట మూటగట్టుకుంది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. రాజధానిపై డిఫెన్స్‌లో పడకుండా ఉండటానికి కేపిటల్‌పై కొత్త హడావుడి మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానని కొత్త పల్లవి ఎత్తుకుంది. వైవీ కామెంట్స్‌పై రెండు రాష్ట్రాల్లో విమర్శలు వెల్తువెత్తడంతో వెంటనే యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ క్రమంలో అసలు కేపిటల్ విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీ రాజధానిగా అమరావతికి ఆమోదం తెలిపిన జగన్. అధికారంలోకి రాగానే కేపిటల్‌పై యూటర్న్ తీసుకున్నారు. పరిపాలనా వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని.. రాజధానులను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. 2019 డిసెంబరు 17న అసెంబ్లీ సాక్షిగా ఆంధ్ర ప్రదేశ్‌కు మూడు రాజధానుల అవసరం ఉందని వ్యాఖ్యానించిన ఆయన. విశాఖ, కర్నూలు కూడా రాజధానులు అవుతాయని ప్రకటించారు.

ఏళ్లు గడుస్తున్నా 3 రాజధానుల దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది ప్రభుత్వం. ఉన్న రాజధాని అమరావతిలో అభివ‌ృద్దిని అటకెక్కించేసింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని విమర్శలు ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికల్లో విపక్షాలకు అది ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది. ఆ క్రమంలో కేపిటల్ విషయంలో డిఫెన్స్‌లో పడినట్లు కనిపిస్తున్న వైసీపీ. సడన్‌గా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటూ కొత్త పల్లవి ఎత్తుకుంది.


ఉమ్మడి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచనని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి, పార్టీ నాయకత్వం దీనిపై చర్చించి ఆలోచిస్తారన్న ఆయన. రాజధానికి కట్టే ఆర్థిక వనరులు లేక.. విశాఖను రాజధానిగా ఏర్పాటు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. విశాఖ రాజధానిగా ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధాని ఉండాలని.. విభజన చట్టం ప్రకారం మరికొంత కాలం హైదరాబాద్ ఉమ్మడిగా వుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. తాను రాజ్యసభకు ఎన్నికయ్యాక ఆ అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తానని ప్రకటించారు.

హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే మంచిదన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటనే స్పందించారు. వైవీ అన్న మాటలు.. ఆయన వ్యక్తిగతమన్న మంత్రి.. ఆ మాటలకు పార్టీ నిర్ణయంతో సంబంధం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.

ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చకు దారితీసాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వైవీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇటు ఏపీలో విపక్షాలు వైసీపీపై విరుచుకుపడటం మొదలు పెట్టాయి. దాంతె దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తున్న వైసీపీ తరపున మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఒక సారి ఎంపీగా పనిచేసి.. ప్రస్తుతం రాజ్యసభ రేసులో ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని అంశాన్ని తనకి తానుగా ప్రస్తావించారా? లేకపోతే వ్యూహాత్మకంగా ఆ వాదన తెరపైకి తెచ్చారా? అన్న చర్చ మొదలైంది. పెద్దిరెడ్డి అది వైవీ సొంత అభిప్రాయం అంటుంటే.. బొత్స సత్యనారాయణ మాత్రం వైవీ వ్యాఖ్యలను వక్రీకరించారని తేల్చేస్తున్నారు. వైవీ ఉమ్మడి రాజధాని ప్రస్తావన ఆఫ్ ద రికార్డ్‌గా కాదు తెచ్చింది. మీడియా ముందే స్పష్టంగా మాట్లాడారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలపై పంచాయితీ నడుస్తోంది.హైదరాబాద్‌పై ఏపీకి హక్కు ఉందన్న విషయాన్ని ఎత్తిచూపి.. ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలించడానికి వైసీపీ వ్యూహం రెడీ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీకాక ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న ప్రచారం జనంలోకి వెళ్తుండటంతో.. హైదరాబాద్‌ను వివాదం చేయడం ద్వారా ప్రజల్లో భావోద్వేగం రగిల్చి.. ఓట్లుగా మల్చుకోవాలని వైసీపీ బావిస్తుందన్న చర్చ మొదలైంది.

వ్యూహం ప్రకారమే హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయం చేయడానికి వైసీపీ స్కెచ్ గీస్తోందన్న టాక్ వినిపిస్తోంది.. ఇన్నాళ్లు మూడు రాజధానుల రాగం ఆలపించిన అధికార పార్టీ.. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మరికొన్నాళ్లు కొనసాగించాలని డిమాండ్ చేయడం అందులో భాగమే అంటున్నారు. హైదరాబాదే రాజధాని అన్న సెంటిమెంట్‌తో ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

చంద్రద్రబాబుని బూచిగా చూపిస్తూ.. సెంటిమెంట్ రగిలించి 2018 లో కేసీఆర్ తెలంగాణలో గెలుపొందారన్న అభిప్రాయం ఉంది. 2023 ఎన్నికల సమయంలో సాగర్ డ్యాంపై పెద్ద డ్రామా నడిపించి.. సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసింది గులాబీ సర్కారు. అయితే అది వర్కౌట్ కాలేదు.
ఇప్పుడు తెలంగాణలో చతికిలపడ్డ రహస్య మిత్రుడు బీఆర్ఎస్‌కు ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నాల్లో భాగంగానే జగన్ ఉమ్మడి రాజధాని డ్రామాకు తెరలేపారన్న వాదన వినిపిస్తోంది. హైదరాబాద్ సెంటిమెంట్ రగిలిస్తే .. అటు ఏపీలో తనకు.. తెలంగాణలో బీఆర్ఎస్‌కు లబ్ది చేకూరుతుందని.. అందుకే సడన్‌గా వైసీపీ కీలక నేత వైవీ ఉమ్మడి రాజధాని పల్లవి అందుకున్నారంటున్నారు.

విభజన బిల్లులో 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని హక్కు ఉన్నా.. ఇప్పుడా గడువు ముగిసే సమయంలో మరికొన్నాళ్లు హైదరాబాద్‌ రాజధానిగా ఉండాలని వైసీపీ అంటుండటం విమర్శల పాలవుతోంది. ఏపీకి రాజధాని లేకుండా చేశారన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్.. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఉమ్మడి రాజధాని ప్రస్తావనే తేలేదు. పైపెచ్చు తెలంగాణ మంత్రివర్గం కోరిక మేరకు హైదరాబాద్‌పై హక్కులన్నీ వదులుకుంది ఏపీ సర్కారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏపీకి సంబంధించిన ఒక్క కార్యాలయం కూడా లేకుండా చేశారు.

హైదరాబాద్‌ నగరంలో ఉన్న ఏపీ ప్రభుత్వ భవనాలన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది వైసీపీ ప్రభుత్వం. అలాంటిది ఆ పార్టీకి ఎన్నికల ముందు ఉమ్మడి రాజధాని గుర్తుకురావడం అతి పెద్ద కామెడీ అన్న సెటైర్లు మోతెత్తిపోతున్నాయి. ఏమోలేండి.. ఎవరి రాజకీయ లెక్కలు వారికుంటాయి కదా?

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×