EPAPER

IND vs ENG Third Test: రాజ్ కోట్ ‘పిచ్’టర్న్ అవుతుందా..? భారత స్పిన్నర్లు తిప్పేస్తారా..?

IND vs ENG Third Test: రాజ్ కోట్ ‘పిచ్’టర్న్ అవుతుందా..? భారత స్పిన్నర్లు తిప్పేస్తారా..?
IND vs ENG Third Test

IND vs ENG Third Test: ఇండియాలో పిచ్ లు అంటే టర్నింగ్ ఎక్కువ ఉంటుందని అంతా అనుకుంటారు. కాకపోతే హైదరాబాద్, విశాఖపట్నంలో జరిగిన రెండు టెస్టుల్లో భారత స్పిన్నర్లు నానా తంటాలు పడ్డారు. బుమ్రా విజృంభించడంతో రెండో టెస్ట్ లో బతికి బట్టకట్టారు. సిరీస్ ను సమం చేశారు. అందరూ అనుకున్నట్టు ఎక్కడా కూడా పిచ్ స్పిన్నర్లకి అనుకూలించలేదు.


కాకపోతే హైదరాబాద్ టెస్ట్ లోని రెండో ఇన్నింగ్స్ లో మాత్రం మనవాళ్లు టామ్ హార్ట్ లీకి వికెట్లు సమర్పించారు. తను 7 వికెట్లు తీసి శభాష్ అనిపించాడు. మూడోరోజు స్పిన్ కి టర్న్ అయ్యిందని నిపుణులు నిగ్గు తేల్చారు.

ఒకప్పుడు ఇండియాలో పిచ్ లు మొదటి రోజు నుంచి తిరిగేవి. దాంతో ఇండియాలో స్పిన్నర్లకి ప్రాధాన్యత పెరిగింది. గత చరిత్రలోని అనుభవాలను ద్రష్టిలో పెట్టుకుని ఇంగ్లాండ్ జట్టు కూడా ఏకంగా ఐదుగురు స్పిన్నర్లను ఏసుకొచ్చింది. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్ లీ, షోయబ్ బషీర్, జాక్ లీచ్ వీళ్లున్నారు. వీరితో పాటు జో రూట్ పార్ట్ టైమ్ బౌలర్ కూడా ఉన్నాడు. తను రెండు టెస్టుల్లో ప్రభావం చూపించాడు.


Read More: అనుభవలేమి.. టీమిండియాలో 8 మంది యువ ఆటగాళ్లే..

అయితే వీరి ఊహలకు కూడా అందకుండా రెండు మ్యాచ్ ల్లో పిచ్ లు స్పందించడంతో అందరూ ఖంగు తిన్నారు. జరిగిన రెండు టెస్టులను పరిశీలిస్తే…ఇంగ్లాండ్ ఎక్కడా ఇబ్బంది పడలేదు. సరికదా… టీమ్ ఇండియానే ఎక్కువ ఇబ్బంది పెట్టింది.

ఒకవేళ రాజ్ కోట్ లో కూడా ఫ్లాట్ పిచ్ అయితే ఇంగ్లాండ్ బజ్ బాల్ థియరీతో టీమ్ ఇండియాకి ముచ్చెమటలు పట్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితే వస్తే, టీమ్ ఇండియా ఎలా ఎదుర్కొంటోంది? అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు.

ఒకరకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ హైదరాబాద్ టెస్ట్ లో గెలిచిందని అంటున్నారు గానీ, కేవలం 28 పరుగుల తేడాతో చచ్చీ చెడి గెలిచిందనే చెప్పాలి. అందుకని భయపడాల్సిన పనిలేదని సీనియర్లు చెబుతున్నారు.

కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు హైదరాబాద్ లో ఓటమికి అన్నే కారణాలున్నాయని చెబుతున్నారు. రాజ్ కోట్ పిచ్ మీద టర్న్ ఉందని కులదీప్ మాటలని బట్టి చూస్తే, మ్యాచ్ త్వరగానే ముగిసిపోతుందని కొందరంటున్నారు. అలా జరిగితే టాస్ ప్రధానంగా మారనుందని అంటున్నారు.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×