EPAPER

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..

Japan Smart Signals: జపాన్ సాంకేతికతతో స్మార్ట్ సిగ్నళ్లు..

Japanese Signal System In Bangalore: ప్రపంచంలో అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న టాప్ టెన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఈ సమస్యను అధిగమించేందుకు దేశంలోనే తొలిసారిగా జపనీస్ సాంకేతికతతో కూడిన ట్రాఫిక్ వ్యవస్థ అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి టెస్టింగ్, ట్రయళ్లు ముగిశాయి.
అనుకున్నట్టు అన్నీ విజయవంతమైతే వచ్చే నెలాఖరుకే ఈ స్మార్ట్ సిగ్నళ్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. కెన్సింగ్టన్ రోడ్, మర్ఫీ రోడ్ జంక్షన్లలో ఆ వ్యవస్థ పరీక్షలు ఇటీవలే ముగిశాయి.


అడ్వాన్డ్స్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్ మెంట్ సిస్టమ్(ATIMS) ఏర్పాటుకు జపనీస్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ(JICA) నిధులు అందజేసింది. ఈ సిస్టమ్ ద్వారా జంక్షన్లలో రద్దీని బట్టి ఆటోమేటిక్‌గా సిగ్నల్స్ మారతాయి. వాస్తవానికి 2014లోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన వెలువడినప్పటికీ.. ఒప్పందంపై సంతకాలు జరిగింది మాత్రం 2021లోనే. ఆ తర్వాతా పలు కారణాల వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర జాప్యం జరిగింది.
బెంగళూరులోని 28 ప్రధాన కూడళ్లలో ఈ వ్యవస్థను నెలకొల్పినట్టు డైరెక్టరేట్ ఆఫ్ అర్బన్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్(DULT) అధికారులు వెల్లడించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జంక్షన వద్ద వాహనాల బారు 30% మేర తగ్గుతుందని చెబుతున్నారు.


Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×