EPAPER

Team India News: అనుభవలేమి.. టీమిండియాలో 8 మంది యువ ఆటగాళ్లే..

Team India News: అనుభవలేమి.. టీమిండియాలో 8 మంది యువ ఆటగాళ్లే..
Team India News

IND vs ENG Test Series update(Sports news headlines): ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న మూడో టెస్టులో 8 మంది క్రికెటర్లు అనుభవం లేని వాళ్లు కనిపిస్తున్నారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ 6 టెస్టులు, అక్షర్ పటేల్ 14, రజత్ పటీదార్ 1 టెస్టు, కేఎస్ భరత్ 7, కుల్దీప్ 9 టెస్టులు ఆడారు.


సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ ఈ ముగ్గురు ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ ఎనిమిది మంది రేపు మూడో టెస్టులో దిగితే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలు నెట్టింట వినిపిస్తాయి. వీరు ఇంగ్లాండ్ సీనియర్స్ ని ఎదుర్కోగలరా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read More: ఆడేది ఎవరు? కూర్చునేది ఎవరు? .. రేపే ఇండియా-ఇంగ్లాండ్ మూడో టెస్ట్


నిజానికి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రేపటి మ్యాచ్ తో 100వ టెస్ట్ ఆడనున్నాడు. జో రూట్ కి 137 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన రికార్డ్ ఉంది. ఇకపోతే జేమ్స్ అండర్సన్ అయితే ఏకంగా 184 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు.

మన టీమ్ ఇండియా సూపర్ హీరోలు చాలామందిని ఎలా అవుట్ చేయాలో తనకి తెలిసినట్టుగా మరెవరికి తెలీదు. వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో 97 టెస్ట్ లు ఆడితే, ఒలిపోప్ 40, జాక్ క్రాలీ 41 టెస్టు మ్యాచ్ లు ఆడిన అనుభవం వారి సొంతం.

ఈ లెక్కన చూస్తే టీమ్ ఇండియాలో 8 మంది అనుభవం లేనివాళ్లకి తోడు శుభ్‌మన్ గిల్ 22 టెస్టులు, మహ్మద్ సిరాజ్ 24 ఆడినవారున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రోహిత్ శర్మకి 54 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది. తను పేలవమైన ఫామ్ తో అవస్థలు పడుతున్నాడు.

ఇంక బుమ్రా 34 టెస్టు మ్యాచ్ లతో ఉంటే, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం 97 టెస్టులు ఆడి, అందరికన్నా అనుభవజ్నుడిలా ఉన్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ ముగిసే సరికి తను కూడా 100 టెస్టుల క్లబ్ లో చేరిపోతాడు.

ఓపెన్ గా చెప్పాలంటే మూడో టెస్ట్ మ్యాచ్ లో యశస్వి, గిల్, సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ల్లో ఎవరో ఒకరు అద్భుతాలు చేయకపోతే, రాజ్ కోట్ మ్యాచ్ లో ఓటమి తప్పదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×