EPAPER

UPSC Notification Released: పలు ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ సిద్ధం.. నేడు నోటిఫికేషన్ విడుదల..

UPSC Notification Released: పలు ఖాళీలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ సిద్ధం.. నేడు నోటిఫికేషన్ విడుదల..

UPSC CSE 2024 Updates: యూనియన్​పబ్లిక్ సర్వీస్ కమిషన్​విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల‌కు ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. సివిల్ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీఎస్‌ఈ), ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామ్‌ 2024 నోటిఫికేషన్లుల్లో పలు కాలిలను భర్తీ చేసేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిధ్దమైంది.


బుధవారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు కొనసాగనుంది. ప్రిలిమినరీ రాత పరీక్షలు మే 26న నిర్వహించనున్నారు. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌తోపాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ కూడా బుధవారమే విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సివిల్ సర్వీసులకు చెందిన ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. అయితే, గతేడాది దాదాపు 1,105 ఖాళీల భర్తీపై ప్రకటన వెలువడింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ దరఖాస్తుకు అర్హులే. డిగ్రీ చివరి యేడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


ఈ దరఖాస్తుకు అభ్యర్తులకు 21 నుంచి 32 ఏళ్లు మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తుది ఎంపికకు ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌‌కు సంబంధించి మెయిన్స్ 2024 సెప్టెంబర్ 20వ తేదీ నుంచి వరుసగా ఐదు రోజులు అంటే సెప్టెంబర్ 25 వరకు నిర్వహించే అవకాశం ఉంది.

భర్తీ చేయనున్న యూపీఎస్సీ సర్వీసులు ఇవే..

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్
ఇండియన్ ఫారిన్ సర్వీస్
ఇండియన్ పోలీస్ సర్వీస్
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్
ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్
ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్
ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్
ఇండియన్ పోస్టల్ సర్వీస్
ఇండియన్ పి అండ్‌ టి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్
ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌)
ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఇన్‌కం ట్యాక్స్‌)
ఇండియన్ ట్రేడ్ సర్వీస్
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్
ఢిల్లీ, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్ హవేలీ పోలీస్ సర్వీస్
ఢిల్లీ, అండమాన్ అండ్‌ నికోబార్ దీవులు, లక్షద్వీప్, డామన్ అండ్‌ డయ్యూ, దాద్రా అండ్‌ నగర్ హవేలీ సివిల్ సర్వీస్
పాండిచ్చేరి సివిల్ సర్వీస్
పాండిచ్చేరి పోలీస్ సర్వీస్

Tags

Related News

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

AP CID Raids: వాసుదేవరెడ్డి ఇంటిపై ఏపీ సీఐడీ సోదాలు.. లిస్టులో చాలామంది!

Virat Kohli: న్యూయార్క్‌లో ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ

Big Stories

×