EPAPER

High Court Clarity on Kodandaram’s Oath: నేడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..

High Court Clarity on Kodandaram’s Oath: నేడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..
prof kodandaram latest news

Today Clarity on Kodandaram’s oath taking(TS Today news): గవర్నర్‌ కోటా కింద ఎంపికైన కొత్త ఎమ్మెల్సీలకు నేడు ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానుంది. హైకోర్టు, నియామకాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం తీర్పు ఇవ్వనుంది. గవర్నర్‌ కోటా కింద కొత్తగా శాసనమండలి సభ్యులుగా జర్నలిస్ట్‌ ఆమెర్‌ అలీ ఖాన్‌, ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నియమితులుకాగా.. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారానికి బ్రేకులు వేసి.. యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తేల్చింది.


పిటిషన్‌ ప్రకారం..
అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, గతంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ పేర్లను సిఫారసు చేస్తూ గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. అయితే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 2023 సెప్టెంబర్‌ 19న ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. ఆర్టికల్‌ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల మేరకు ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లుగా గవర్నర్‌ ప్రకటించారు.

Read More: కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి


ఈ తిరస్కరాన్ని శ్రవణ్, సత్యనారాయణలు సవాల్‌ చేస్తు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజే‌ఐ.. ఫిబ్రవరి 8కి పిటిషన్ వాయదా వేసింది. వాస్తవాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ పిటిషన్ల విచారణ చేయాలని చెప్పింది. ఈ సందర్భంగా పిటిషన్లపై విచారణ ముగిసే వరకు కొత్తగా గవర్నర్‌ కోటాలో ఎవరినీ నియమించకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనిని తోసిపుచ్చిన కోర్టు గవర్నర్‌కు అలా ఆదేశాలు జరీ చేయడం జరగదని స్పష్టం చేసింది.

కొత్త నియామకాలపై స్టే ఇవ్వండి
ఈ తరుణంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ఫ్రొఫెసర్‌ కోదండరాం, జర్నలిస్ట్‌ ఆమెర్‌ అలీ ఖాన్‌లను నియమిస్తూ.. ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ గవర్నర్‌ తమిళిసై ఉత్తర్వులు జరీచేశారు. దీంతో జీవో నంబర్‌ 12ను సవాల్‌ చేస్తూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ)లు దాఖలు చేశారు. కొత్త నియామకాలను నిలిపివేయలని కోరారు. అలాగే అమేర్‌ అలీఖాన్‌, కోదండరాంలను ప్రధాన పిటిషన్‌లో ఇంప్లీడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అప్లికేషన్‌పై ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల అంశం హైకోర్టులో విచారణ దశలో ఉండగా కొత్త వారిని నియమించడం సరికాదని దాసోజు తరఫున సీనియర్‌ న్యాయవాది అదిత్యా సోదీ వాదనలు వినిపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఇద్దరి పేర్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం సిఫారసు చేసిందని, వాటిని పరిశీలించిన తర్వాతే గవర్నర్‌ ఆమోదించారని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సుదర్శన్‌రెడ్డి వాదించారు.

Tags

Related News

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Big Stories

×