EPAPER

Gajuwaka Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. గాజువాక పవన్ ను గెలిపిస్తుందా ?

Gajuwaka Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. గాజువాక పవన్ ను గెలిపిస్తుందా ?
pawan kalyan latest news

Bigtv Election Survey in Gajuwaka Assembly Constituency(ap politics): ఏపీలో.. మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఉత్తరాంధ్రలో కీలక నియోజకవర్గం గాజువాక. ఇది 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పెందుర్తి శాసనసభ పరిధిలో ఉండేది. ఆ తర్వాత ప్రత్యేక సెగ్మెంట్ గా ఏర్పడింది. ఇక్కడ 2019లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేశారు. ఒకప్పుడు గాజువాక, అనకాపల్లి, చోడవరం మొదలైన ప్రాంతాలన్నీ కూడా బొబ్బిలి, విజయనగరం సంస్థానాల వారి అధీనంలో ఉండేవి. గాజువాక ఆటోనగర్ ప్రాంతం వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం. గాజువాకలో సినీ నటుల అభిమాన సంఘాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఈ సీటును ఎంపిక చేసుకుని ఉండవచ్చు. కానీ ఫలితం అనుకున్నట్లు మాత్రం రాలేకపోయింది. మరి ఇప్పుడు గాజువాక నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


తిప్పల నాగిరెడ్డి (వైసీపీ గెలుపు) VS పవన్ కల్యాణ్ (జనసేన)

2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక సెగ్మెంట్ లో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి, తన సమీప ప్రత్యర్థి కొణిదెల పవన్ కల్యాణ్ పై 14 వేల 520 ఓట్లతో గెలిచి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 38 శాతం ఓట్లు సాధించగా.. జనసేన కచ్చితంగా గెలుస్తుందనుకున్న చోట పవన్ కల్యాణ్ కు 29 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి కలిసి వచ్చింది. అలాగే వైసీపీ వేవ్ కూడా పని చేసింది. ఇక టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు 28 శాతం ఓట్లు రాబట్టి మూడో స్థానంలో నిలిచారు. అయితే గాజువాకలో టీడీపీ, జనసేన ఓట్ల శాతం కలిపితే 57 శాతంగా ఉంది. అంటే గెలిచిన వైసీపీ అభ్యర్థి కంటే చాలా ఎక్కువ. కానీ వేటికవే పోటీ చేయడం వల్ల గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన అనుకున్న ఫలితాలు రాలేకపోయాయి. మరి ఈసారి పరిస్థితులు మారాయి. వచ్చే ఎన్నికల్లో గాజువాక సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.


వరికూటి రామచంద్రారావు (YCP) ప్లస్ పాయింట్స్

గాజువాక సెగ్మెంట్ లో కార్పొరేటర్ గా పని చేసిన అనుభవం

నియోజకవర్గంలో క్రియాశీలంగా మారడం

పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా జరపడం

నాగిరెడ్డిపై అసంతృప్తిగా ఉన్న క్యాడర్ ను ఆకర్షించడం

సమస్యల పరిష్కారంపై చొరవ చూపుతారన్న అభిప్రాయం

వరికూటి రామచంద్రారావు మైనస్ పాయింట్స్

సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం ఎంత వరకు సహకరిస్తుందన్న డౌట్లు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ

ఇప్పటికే స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద ఎత్తున ధర్నాలు

టిడ్కో ఇండ్లు లబ్దిదారులకు అందించకపోవడం

అర్హులైన వారికి ఇంకిన్ని ఇండ్లు నిర్మించాలన్న డిమాండ్లు

పెదగంట్యాడలో కొందరి పెన్షన్లు అకారణంగా తొలగించడం

గాజువాడ టౌన్ లో పెరిగిన ట్రాఫిక్ సమస్యలు, ఇరుకు రోడ్లు

ఫ్లైఓవర్లు కట్టాలని, రోడ్ల విస్తరణ చేపట్టాలన్న డిమాండ్లు

స్టీల్, ఫార్మా ఫ్యాక్టరీల కాలుష్య నియంత్రణ చేయాలని డిమాండ్లు

పల్లా శ్రీనివాసరావు (TDP) ప్లస్ పాయింట్స్

పబ్లిక్ లో పల్లా శ్రీనివాసరావుకు పాజిటివ్ ఇమేజ్

టీడీపీ 6 గ్యారెంటీలపై జనంలో విస్తృతంగా ప్రచారం

పల్లాకు బలమైన క్యాడర్ మద్దతు

పల్లా శ్రీనివాసరావు మైనస్ పాయింట్స్

తన హయాంలో సెగ్మెంట్ అభివృద్ధి జరగకపోవడం మైనస్

టీడీపీలో కొత్త తరం నేతలు రావాలని జనంలో అభిప్రాయం

కొణిదెల పవన్ కల్యాణ్ (JSP) ప్లస్ పాయింట్స్

జనసేన అధినేతగా, సినీ హీరోగా బలమైన ఇమేజ్

గతంలో రెండు సెగ్మెంట్లలో ఓడిన సానుభూతి

ప్రజా సమస్యలపై సీరియస్ గా పోరాటం చేయడం

రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తారన్న అభిప్రాయం

టీడీపీ-జనసేన పొత్తులతో పోటీకి దిగడం ప్లస్ పాయింట్

గాజువాకలో కాపు కమ్యూనిటీ బలంగా ఉండడం

ఈ సెగ్మెంట్ లో పవన్ కల్యాణ్ కు అభిమాన సంఘాలు ఉండడం

ఇక వచ్చే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

వరికూటి రామచంద్రారావు VS పల్లా శ్రీనివాసరావు (TDP)

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, పొత్తులో భాగంగా టీడీపీకి టిక్కెట్ దక్కితే గాజువాకలో తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ నుంచి బరిలో దిగే వరికూటి రామచంద్రారావుకు 45 శాతం ఓట్లు, అలాగే టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తే 47 శాతం ఓట్లు, ఇక ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ ఓట్ షేర్ కు కారణం కాస్ట్ ఈక్వేషన్స్ బలంగా కనిపిస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా కీ ఫ్యాక్టర్ కాబోతోంది. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు కూడా ఈ కూటమికి కలిసి వస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గాజువాక తగినంతగా అభివృద్ధి చెందకపోవడం కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమని జనం అభిప్రాయంగా తేలింది. అలాగే గాజువాక వైసీపీలో విభేదాలు కూడా టీడీపీ కూటమికి కలిసి వచ్చే పరిణామంగా కనిపిస్తోంది.

వరికూటి రామచంద్రారావు VS కొణిదెల పవన్ కల్యాణ్

ఇక మరో సినారియోలో వైసీపీ నుంచి వరికూటి రామచంద్రారావు, జనసేన నుంచి కొణిదెల పవన్ కల్యాణ్ బరిలో దిగితే జనసేన గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థి వరికూటి రామచంద్రారావుకు 43 శాతం ఓట్లు, అలాగే జనసేన నుంచి పవన్ కల్యాణ్ పోటీకి దిగితే 49 శాతం ఓట్లు, ఇతరులకు 8 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి పవన్ కల్యాణ్ వైపు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పొత్తులో భాగంగా జనసేనకు టిక్కెట్ దక్కితే టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తటస్థంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు పార్టీల ఓట్లు కలిసి వచ్చి జనసేన అభ్యర్థి గెలిచేందుకు అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×