EPAPER

Bullet Train : ఏమిటీ బుల్లెట్ ట్రైన్ కారిడార్?

Bullet Train : ఏమిటీ బుల్లెట్ ట్రైన్ కారిడార్?
Bullet Train Project In India

Bullet Train Project In India (today news telugu) :


రెండు గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరొచ్చు. ఈ మేరకు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసేలా ఈ కారిడార్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా బిలిమోర-సూరత్ మధ్య తొలి 50 కిలోమీటర్ల మేర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ పనులు పూర్తవుతాయని నిరుడు కేంద్రం ప్రకటించింది.

ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు 2021 నవంబర్‌లో ఆరంభమై శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనుల పురోగతికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఆధునిక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గురించి వివరాలను ఆ వీడియో ద్వారా వెల్లడించారు. భవిష్యత్తు భారతంగా ఆ ప్రాజెక్టును అభివర్ణించారు కేంద్ర మంత్రి. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్‌లో అదనంగా 24 నదీబ్రిడ్జిలను, 28 స్టీల్ బ్రడ్జిలను నిర్మిస్తున్నారు.


Read more : పీఎం సూర్య ఘర్‌ పథకంతో ఉచిత విద్యుత్‌.. ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ దరఖాస్తు ప్రక్రియ ఇలా

భారతీయ రైల్వే తన ఆపరేషన్లను ఆరంభించే సరికి.. ఈ రూట్‌లో 35 బుల్లెట్ ట్రైన్లు నడుస్తాయి. ఇవి రోజుకు దాదాపు 70 ట్రిప్పులు తిరుగుతాయి.

2050 నాటికి బుల్లెట్ రైళ్ల సంఖ్యను 105కి పెంచుతారు. అప్పటికి ఏటా 1.6 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా. ఇవీ విశేషాలు..

  • కేంద్రమంత్రి వీడియో ప్రకారం.. ఈ ప్రాజెక్టులో తొలిసారిగా శ్లాబ్ ట్రాక్ సిస్టమ్ ను వినియగిస్తున్నారు.
  • భూకంపాలను ముందుగానే గుర్తించగలిగే వ్యవస్థను బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో ఏర్పాటు చేస్తారు.
  • ఈ రూట్ కోసం పర్వతమార్గంలో 7 టన్నెళ్లు ఉంటాయి.
  • ప్రాజెక్టులో సముద్ర టన్నెల్ కూడా ఓ భాగం. దీని పొడవు 7 కిలోమీటర్లు.
  • ఈ కారిడార్‌లో 12 అత్యంత అధునాతన రైల్వే స్టేషన్లను నెలకొల్పుతున్నారు.
  • అంచనా వ్యయం మొత్తం రూ.1.08 లక్షల కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.10 వేల కోట్లు. గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు రూ.5 వేల కోట్ల చొప్పున భరిస్తాయి.
  • మిగిలిన మొత్తాన్ని జపాన్ రుణంగా అందిస్తోంది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×