EPAPER

Rare Foods in the World: ప్రపంచంలో విచిత్రమైన వంటకాలు!

Rare Foods in the World: ప్రపంచంలో విచిత్రమైన వంటకాలు!

Rare Foods in World : ప్రపంచంలోని కొన్ని దేశాల ప్రజలు ఆహారం చాలా విచిత్రంగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే మనదేశంలో తిండికి దూరమైనవన్నీ విదేశాల్లో ఆహారం రూపంలో కడుపులోకి చేరుతున్నాయి. చెప్పాలంటే గొంగళిను ఫ్రై చేసి తింటారట. ఇలా తినేది చైనా మాత్రమే అనుకోకండి. ఇంకా చాలా దేశాల్లో ఇలాంటి వింత ఆహారపు అలవాట్లు ఉన్నాయట.


సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక వంటకానికి ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్‌ అంటే బిర్యానీ, నెల్లూరు అంటే చేపల పులుసు, రాయలసీమ అయితే రాగి సంగటి, నాటుకోడి ఫేమస్ అయిన వంటకాలు.

కానీ కొన్ని దేశాల్లో ఫేమస్‌ అయిన వంటకాలు చూస్తే.. మీకు కచ్చితంగా వాంతి వస్తుంది. కామన్‌గా గొంగళిపురుగు పొరపాటున బట్టల మీద పాకితేనే.. ఎంతో చిరాకు పడతాం. అలాంటిది గొంగళిపురుగుతో ఫ్రై చేస్తే.. ఎలా ఉంటుందో మీ ఇమాజిన్‌కే వదిలేస్తున్నా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్‌ అయిన చిత్ర విచిత్ర వంటకాలు ఏంటో చూసేద్దాం.


Read More: బ్లాక్ ఆపిల్స్.. వీటి స్పెషల్ తెలుసా..!

  • మనం చిన్నప్పుడు చెట్టుపై వాలిన తూనీగను పట్టుకొని తోకకు దారం కట్టి ఆడుకునే వాళ్లం. కానీ చైనాలోని నైరుతి ప్రావిన్స్‌లో తూనిగని వేయించుకుని తింటారు. ఇది వారికి చాలా ఇష్టమైన వంటకాల్లో ఒకటి.
  • చైనా ప్రజలు గొంగళి పురుగులను వేయించుకొని తింటారు. ముందుగా వీటిని ఉడికించే ముందు నీటిలో నానబెడతారు. ఆ తర్వాత వాటిని ఉల్లిపాయలు, అల్లం కలిపి వంట చేస్తారు.
  • యునాన్ ప్రావిన్స్‌లో నల్ల చీమలను తింటారు. అది కూడా పంది మాంసంతో కలిపి వండుతారు. వాళ్లు పందికాళ్లతో చేసిన సూప్ కూడా తాగుతారు.

Read More: పెన్నుతో అరటిపండ్లను నిల్వ ఉంచే ఈ ట్రిక్ మీకు తెలుసా ?

  • ఆవు పేడ సూప్ నైరుతి చైనాలోని గుయిజౌ ప్రావిన్స్ నుంచి ఉద్భవించింది. ఇది కేవలం ఆవు పేడతో తయారు చేస్తారు. ఇది ఆవు కడుపులో కనిపించే ద్రవం. ఈ సూప్ అక్కడ చాలా ప్రత్యేకమైన వంటకం.
  • ఎండిన ఎలుకను ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ ప్రజలు ఇష్టంగా తింటారు. మొదటగా వీరు రైతులు పంటలను పట్టుకోవడాని పట్టుకునే ఎలుకలను తినడం ప్రారంభించారు.ఇప్పుడు అధిక ప్రోటీన్ కోసం తింటున్నారు.
  • జపనీస్ ప్రజలు ఆక్టోపస్‌ ఐస్ క్రిమ్ చాలా ఇష్టంగా తింటారు. ఆక్టోపస్‌ను ముందుగా ఐస్‌క్రీమ్‌ను తయారు చేయడానికి వండుతారు. తర్వాత ఐస్‌క్రీమ్‌లో ఆక్టోపస్ కలిపి అందులో పాలు, పంచదార, వెనీలా విడివిడిగా కలుపుతారు.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×