EPAPER

IPS Transfers: బదిలీల పర్వం.. రాచకొండ సీపీగా తరుణ్ జోషి..

IPS Transfers: బదిలీల పర్వం.. రాచకొండ సీపీగా తరుణ్ జోషి..
IPS Transfers in Telangana

IPS Transfers in Telangana(Breaking news in telangana): తెలంగాణ రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. సోమవారం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ని ప్రక్షాలన చేసింది తెలంగాణ సర్కార్. అందులో భాగంగానే రాచకొండ సీపీగా తరుణ్ జోషిని నియమించింది. ప్రస్తుతం రాచకొండ సీపీగా ఉన్న సుధీర్ బాబును హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీగా నియమించింది.


మొత్తం 12 మంది ఐపీఎస్‌లు, 110 డీఎస్పీలను, 39 ఏఎస్పీలను, 5 నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తు సోమవారం తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

పోస్టింగ్ కోసం ఎదురుచూస్తోన్న ఎమ్. శ్రీనివాసులును రామగుండం సీపీగా నియమించింది తెలంగాణ సర్కార్. జోయల్ డేవిస్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా, నారాయణ నాయక్‌ను సీఐడీ డీఐజీగా, అపూర్వారావును టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా నియమించింది.


Read More: ఎక్సైజ్‌ సూపరింటెండెంట్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్..

ఇక హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీగా గిరిధర్, జోగులాంబ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, హైదరాబాద్ సౌత్ వెస్ట్ డీసీపీగా సాధన రష్మీ, తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరక్టర్‌గా మురళీధర్‌లను నియమించింది. ఇక భన్వర్‌లాల్ ఇంటి వివాదంలో చిక్కుక్కున్న ఐపీఎస్ నవీన్ కుమార్‌ను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వీరితో పాటు నలుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్. నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌(లోకల్ బాడీస్)గా పని చేస్తోన్న చిత్రా మిశ్రాను ఐటీడీఏ, ఏటూరునాగారం ప్రాజెక్టు అధికారిగా ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంకిత్‌ను నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌(లోకల్ బాడీస్)గా నియమించారు. ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్‌(లోకల్ బాడీస్)గా పనిచేస్తోన్న ఖుష్బూ గుప్తాను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూర్ ఐటీడీఏగా ఉన్న చాహత్ బాజ్‌ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×