EPAPER

Oppo Reno 11F 5G: ఒప్పో నుంచి మరో మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ.. అదిరిపోయిన ఫీచర్లు..!

Oppo Reno 11F 5G: ఒప్పో నుంచి మరో మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ.. అదిరిపోయిన ఫీచర్లు..!

Oppo Reno 11F 5G Price and Features: ప్రముఖ టెక్ కంపెనీలు ప్రస్తుతం మిడ్ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. వీటిపైనే వినియోగదారులు ఆసక్తి చూపించడం.. మార్కెట్‌లో వీటికి సూపర్ డిమాండ్ ఏర్పడటంతో వరుసపెట్టి మొబైళ్లను మార్కెట్‌లోకి దింపుతున్నాయి. అందులో వివో, వన్‌ప్లస్, ఒప్పో వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఉన్నాయి.


కస్టమర్ల దృష్టిని ఆకర్షించి వారికి నచ్చే విధమైన రీతిలో స్మార్ట్‌ఫోన్లను తీసుకువస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు, అప్‌గ్రేడెడ్ వెర్షన్లతో కొత్త కొత్త మోడళ్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ప్రముఖ చైనీస్ టెక్ సంస్థ ఒప్పో ఇప్పటికే ఎన్నో కొత్త మోడళ్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మిడ్‌రేంజ్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ మేరకు ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ (Oppo Reno 11F 5G) స్మార్ట్‌ఫోన్‌ను థాయ్‌లాండ్‌లో ఆవిష్కరించింది.

అయితే ఒప్పో రెనో 11 5జీ, రెనో 11 ప్రో 5జీ వంటి మోడళ్లను కంపెనీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిరీస్‌లో ఒప్పో రెనో 11ఎఫ్ 5జీను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెటప్‌తో వచ్చింది. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కలిగి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్‌ను తెలుసుకుందాం..


ఫీచర్లు, స్పెసిఫికేషన్స్:

ఒప్పో రెనో 11ఎఫ్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ అమొలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లీంగ్ రేట్, 1100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ఓఎస్ 14తో రన్ అవుతుంది. డైమెన్సిటీ 7050 ఎస్ఓసీతో పనిచేస్తుంది. ఇందులో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్స్ సూపర్‌వోక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐపీ65 రేటింగ్ డస్ట్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 64 మెగా పిక్సెల్ OV64B ప్రైమరీ సెన్సాన్‌ను కలిగి ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ సోరీ IMX355 సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ను ఇందులో అమర్చారు. దీంతోపాటు సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సోనీ IMX615 సెన్సార్‌ను అందించారు.

ధర:

దీనిని థాయ్‌లాండ్‌లో రిలీజ్ చేయగా.. అక్కడ THB10,990గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.25,540గా తెలుస్తోంది. ఈ ఫోన్ కేవలం ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో ఒప్పో ఎఫ్25 (OPPO F25)గా లాంచ్ కావచ్చని కొన్ని లీక్స్ సూచిస్తున్నాయి.

Tags

Related News

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Big Stories

×