EPAPER

Hookah Parlours Ban: తెలంగాణలో హుక్కా పార్లర్లు బ్యాన్.. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన అసెంబ్లీ!

Hookah Parlours Ban: తెలంగాణలో హుక్కా పార్లర్లు బ్యాన్.. ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించిన అసెంబ్లీ!
Telangana Passed bill banning Hookah Parlours

Telangana Assembly Passes bill Banning Hookah Parlors: హుక్కా పార్లర్ల నిర్వహణను నిషేధించే బిల్లును తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తరఫున రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టిన పెట్టారు.


హుక్కాతో కళాశాల విద్యార్థులు సహా యువత నష్టపోతున్నారు. దీంతో వారి జీవితం ఆందోళనకరంగా మారుతోంది. వీటిన అధిగమించడానికే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

సిగరెట్ కన్నా హుక్కా చాలా ప్రమాదకరమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. యువత హుక్కాకు చాలా త్వరగా అడిక్ట్ అవుతారన్నారు. హుక్కా పీల్చే యువతను విషపూరిత పదార్థాలకు దగ్గర చేస్తోందని తెలిపారు.


Read More: కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు..? సీఎం రేవంత్ నిలదీత..

అదనంగా, నిష్క్రియ ధూమపానం చేసేవారిపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో హుక్కా పార్లర్‌ల వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను నొక్కి చెప్పారు.

ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు హుక్కా బార్‌లపై నిషేధం వంటి కఠినమైన చర్యలు అవసరమని ప్రభుత్వం విశ్వసిస్తోందని మంత్రి పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందని తెలిపారు.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు (వ్యాపారం, వాణిజ్యం, ఉత్పత్తి, సరఫరా, పంపిణీపై ప్రకటనల నిషేధం, నియంత్రణ) (తెలంగాణ సవరణ) 2024 బిల్లును ఎటువంటి చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదించారు.

Tags

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×