EPAPER

PM Modi: ‘ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు.. దేశానికి సేవచేయడమే ముఖ్యం’

PM Modi: ‘ఏ ఉద్యోగం చేస్తున్నామన్నది కాదు.. దేశానికి సేవచేయడమే ముఖ్యం’

PM Modi handed over the appointment papers: నియామకాల ప్రక్రియను తమ ప్రభుత్వం పారదర్శకంగా మార్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన ‘రోజ్‌గార్‌ మేళా’ కింద ఉద్యోగాలు పొందిన లక్షమందికిపైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించి మాట్లాడారు.


తమ ప్రభుత్వం నియామక ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తోందని పీఎం మోదీ అన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి తన సామర్థ్యం ప్రదర్శించేలా సమాన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగానికి అభ్యర్థి దరఖాస్తు చేసుకొన్నప్పటి నుంచి అపాయింట్‌మెంట్‌ లేఖను అందుకొనే వరకూ ఉన్న సమయాన్నిపూర్తిగా కుదించామన్నారు. గత ప్రభుత్వాలు నియామక ప్రక్రియల్లో జాప్యం చేసేవారన్నారు. దీంతో అవి సుదీర్ఘంగా సాగేవికావన్నారు.

ఉద్యోగాల నియామకం సమయం సుదీర్ఘంగా ఉండడం వల్ల లంచాల వసూళ్లు వంటివి జోరుగా చోటు చేసుకొనేవని పీఎం మోదీ అన్నారు. తమ ప్రభుత్వం నియామకాలను పారదర్శకంగా చేపడుతోందన్నారు. దేశానికి యువత సేవ చేసేలా 2014 నుంచి వారికి సహకరించాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నాని మోదీ పేర్కొన్నారు.


More Read: 17వ లోక్ సభ.. మోదీ చివరి స్పీచ్!

తమ ప్రభుత్వం ‘వికసిత్‌ భారత్‌’ ప్రయాణంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగిదీ కీలక పాత్రేనని మోదీ అన్నారు. నేడు కొత్తగా చేరుతున్న లక్షమంది ఉద్యోగులు మాకు నూతన శక్తిని అందిస్తారన్నారుత. వారు ఏ శాఖలో చేరారన్నది ముఖ్యం కాదు.. దేశానికి అంకిత భావంతో సేవ చేయడం కీలకమని మోదీ అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకొంటే ఈ పదేళ్లలో మేం 1.5 రెట్లు అదనంగా ఉద్యోగావకాశాలను కల్పించామని ప్రధాని తెలిపారు.

యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో రోజ్ గార్ మేళా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అక్టోబర్‌ 2022లో ప్రారంభించారు. తాజాగా ఆయన ‘కర్మయోగి భవన్‌’కు శంకుస్థాపన చేశారు. ‘మిషన్‌ కర్మయోగి’ కింద వివిధ వర్గాలను సమన్వయం చేసుకోవడానికి ఈ భవనాన్ని వినియోగించనున్నారు. సామర్థ్యాల పెంపునకు అవసరమైన సంకల్పాన్ని మిషన్ కర్మయోగి బలోపేతం చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×