EPAPER

U19 World Cup Final: ఓడిన కుర్రాళ్లు.. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం!

U19 World Cup Final: ఓడిన కుర్రాళ్లు.. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం!
U19 World Cup Final

U19 World Cup Final IND vs AUS: సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా యువ జట్టు, సీనియర్ల బాటలోనే నడిచింది. ఫైనల్ లో ఓటమిపాలై, ఆరోసారి కప్ అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్ ఇండియా కుర్రాళ్లు ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేశారు. క్రమం తప్పకుండా వికెట్లు పోగొట్టుకున్నారు. 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇంకా 6.1 ఓవర్లు ఉండగానే కథ కంచికి చేర్చారు.


అందరూ భయపడినట్టుగానే జరిగింది. అంతవరకు తడబడుతూ ఆడిన ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లో ఇరగదీసి వదిలింది. అంతవరకు ఓటమన్నదే ఎరుగుని టీమ్ ఇండియా ఆడాల్సిన ఒక్క మ్యాచ్ లో చేతులెత్తేసింది. సీనియర్లకు ఎదురొచ్చింది.

నిజానికి టీమ్ ఇండియా ఓటమి, టాస్ తోనే మొదలైంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచి స్టేడియంలో గాలి విపరీతంగా వేస్తోంది. వర్షం పడే సూచనలున్నాయని అందరూ అన్నారు. అందుకనే ఆస్ట్రేలియా ముందు బ్యాటింగ్ తీసుకుంది.


Read More: టైటిల్ నిలబెట్టుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. స్పెషల్ అట్రాక్షనగా కావ్య మారన్..

ఒకవేళ మ్యాచ్ మధ్యలో వర్షం పడితే డక్ వర్త్ లుయిస్ పద్ధతి ద్వారా తమకు మేలు కలుగుతుందనేది ఒకటి, ఇక రెండోది సెకండ్ బ్యాటింగ్ సమయానికి పిచ్ మీద తేమశాతం పెరిగి, పేస్ బౌలింగ్ లో బాల్ జారి స్వింగ్ ఇంకా ఎక్కువవుతుంది. బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేరని అనుకున్నారు. వాళ్లనుకున్నట్టే జరిగింది. అంతవరకు టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడిన కుర్రాళ్లు ఫైనల్ మ్యాచ్ లో ఆ కఠినమైన పిచ్ మీద తడబడి మ్యాచ్ నే కాదు, వరల్డ్ కప్ ని చేజార్చుకున్నారు.

ఇంతవరకు జట్టుకి వెన్నుముకలా నిలిచిన మిడిలార్డర్ బ్యాటర్లు కీలకమైన సమయంలో చేతులెత్తేశారు. కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్ ఇద్దరూ వెంటవెంటనే అయిపోవడంతో మ్యాచ్ మీద ఆశలు పోయాయి. 254 పరుగుల లక్ష్యాన్ని ప్రారంభించిన టీమ్ ఇండియా కుర్రాళ్లు మొదటి బాల్ నుంచి కూడా పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు.

ఆ క్రమంలోనే 2.2 ఓవర్ లో కల్లమ్ వేసిన బంతికి కులకర్ణి (3) అవుట్ అయ్యాడు. 12 ఓవర్లు గడిచేసరికి ఒక వికెట్ నష్టానికి 40 పరుగులు మాత్రమే వచ్చాయి. అంతవరకు అతి జాగ్రత్తగా ఆడటం వల్ల రన్ రేట్ భారీగా పెరిగిపోయింది. దీంతో షాట్లు కొట్టక తప్పని పరిస్థితుల్లో మనవాళ్లు ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నించి అవుట్ అయిపోయారు.

ఇంతవరకు అన్ని మ్యాచ్ ల్లో బ్రహ్మాండంగా ఆడిన ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రన్ రేట్ పెంచే క్రమంలో కెప్టెన్ ఉదయ్ సహరన్ (8) భారీ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు.

అండర్ 19 జట్టులో కీలకంగా మారిన సచిన్ దాస్ (9) వెంటనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మన తెలుగు కుర్రాడు అరవెల్లి అవినాశ్ డక్ అవుట్ అయ్యాడు. తర్వాత ప్రియాన్షు మోలియా (9) కూడా ముందున్నవాళ్ల బాటే పట్టాడు. ఓపెనర్ గా వచ్చి ఎంతో ఓపికగా 30 ఓవర్ల వరకు నిలిచిన ఆదర్శ్ సింగ్ (47) కూడా అవుట్ అయిపోయాడు. సెమీఫైనల్ లో మ్యాచ్ గెలిపించిన రాజ్ లింబానీ డక్ అవుట్ అయ్యాడు.

మురుగున్ అభిషేక్ (42 ) అందరిలో ఆశలు రేపాడు. కానీ తను కూడా అవుట్ కావడంతో భారత్ కథ ముగిసిపోయింది. ఆస్ట్రేలియా బౌలింగ్ లో మహిల్ బియర్డ్ మేన్ 3, రఫెల్ మెక్ మిలన్ 3, కల్లమ్ విడ్లర్ 2, అండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్టు పడగొట్టారు.

ఆస్ట్రేలియాలో మాత్రం హర్జాస్ సింగ్ (55) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముగ్గురు బ్యాటర్లు 40 పరుగులు పైనే సాధించి, ఆఫ్ సెంచరీకి దగ్గరలో అవుట్ అయ్యారు. అందువల్ల ఆస్ట్రేలియా ఆ స్కోరు సాధించింది. మన కుర్రాళ్లు ఆ భాగస్వామ్యాలను కొనసాగించలేక ఓటమి పాలయ్యారు.

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×