EPAPER

Sunrisers Lifts back-to-back SA20 Titles: టైటిల్ నిలబెట్టుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. స్పెషల్ అట్రాక్షనగా కావ్య మారన్!

Sunrisers Lifts back-to-back SA20 Titles: టైటిల్ నిలబెట్టుకున్న సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్.. స్పెషల్ అట్రాక్షనగా కావ్య మారన్!
Sunrisers Eastern Cape vs Durban's Super Giants:

Sunrisers Eastern Cape Won SA20 Cup: సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పేరు చాలా తక్కువమందికి తెలుసు. తను నిజానికి సోషల్ మీడియాలో కూడా ఉండదు. అసలు ఆ ఛాయలకే రాదు, అంతేకాదు బయట కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది. అయితే సౌతాఫ్రికా టీ 20 లీగ్ లో తమ జట్టు, డిపెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఛాంపియన్‌గా నిలిచింది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 89 పరుగులతో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను ఓడించింది.


మ్యాచ్ జరుగుతున్నంత సేపు సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సందడి సందడి చేసింది. ఈ ఫైనల్ లో కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. బ్యాటింగ్ లో తమ బ్యాటర్లు ఫోర్లు, సిక్స్ లు కొట్టినప్పుడు, బౌలింగ్ లో వికెట్లు తీసినప్పుడు ప్రతీసారి కావ్య మారన్ సంబరాలు చేసుకుంది. దీంతో మ్యాచ్ ని ఎవరూ చూడలేదు. ఎందుకంటే ప్రతీక్షణం కెమెరాని ఆమెవైపే కెెమెరామెన్ ఫోకస్ చేశాడు.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 204 పరుగుల స్కోర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (56), టామ్ అబెల్(55), కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ (42), జోర్డాన్ హెర్మెన్ (42) అదరగొట్టారు.


డర్బన్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో కేశవ్ మహరాజ్ 2 వికెట్లు తీశాడు. రీస్ టోప్లీ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్ 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మార్కో జాన్సెన్ (5/30) వీరి పతనాన్ని శాసించాడు. మొత్తానికి 89 పరుగులతో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘన విజయం సాధించింది.

తమ జట్టు ఛాంపియన్‌గా నిలవడంపై సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంతోషం వ్యక్తం చేసింది. వరుసగా రెండు టైటిళ్లు గెలవడం చిన్న విషయం కాదని తెలిపింది. ఇదంతా తమ ఆటగాళ్ల ప్రతిభ వల్లే సాధ్యమైందని తెలిపింది. మొత్తానికి తమ జట్టు టైటిల్ నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది.

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×