EPAPER

Yousufguda Murder: క్రైమ్‌ చిత్రాన్ని తలపించిన రాము హత్య.. ఐదుగురి అరెస్ట్!

Yousufguda Murder: క్రైమ్‌ చిత్రాన్ని తలపించిన రాము హత్య.. ఐదుగురి అరెస్ట్!
Hyderabad news today

Yousufguda Murder Case Updates: సింగోటి రాము హత్యోదంతంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూశాయి. వివాహేతర సంబంధం, పాత కక్ష్యలు, చెడు అలవాట్లు రాము మర్డర్‌కు కారణమయ్యాయి. ఇవే కాదు కోట్ల రూపాయలు అతడి ప్రాణాలను మింగిందనే చెప్పాలి.


హైదరాబాద్‌ నగరం యూసుఫ్‌గూడలో బుధవారం జరిగిన సింగోటి రాము దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. స్నేహితుల పాత కక్షలతో ఒకరు.. పని అయిపోయిందని మరొకరు.. తమ ప్రియురాలిని వేధించాడని ఇంకొకరు ఇలా అంతా ఏకమై పక్కా ప్లాన్‌తో అతికిరాతకంగా రాముని అంతమొందించారు. ఒకరిద్దరూ కాదు ఏకంగా 10 మంది కత్తి దాడి చేసి.. మర్మాంగాలను కోసి తమ కక్షను తీర్చుకున్నారు. పోలీసులు దర్యాప్తులో ఈ నిజాలు వెలుగు చూడటంతో మర్డర్‌ క్రైమ్‌ కథా చిత్రాన్ని తలపిస్తోంది సింగోటి హత్యోదంతం

Read More: Kamareddy Govt Hospital: నేను రాను బిడ్డో కామారెడ్డి దవాఖానకు.. ఐసీయూలో రోగిని కరిచిన ఎలుకలు..


నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్ట రాము అలియాస్‌ సింగోటి రామన్న కోట్లు సంపాదించాడు. హైదరాబాద్‌లో చేసిన రియల్‌ దందా కలిసివచ్చింది. అంతేకాదు.. అతను ఆడే జువ్వ ఆటతో ఉన్న ఆదాయం రెట్టింపు అయింది. దీంతో వందల కోట్లు గడించాడు రాము. ఈ క్రమంలోనే హిమాంబి అనే మహిళ మత్తులో చిక్కుకున్నాడు. డబ్బుల కోసం ఏమైనా చేసే హిమాంబి రాము పరిచయం గోల్డెన్‌ ఛాన్స్‌ అనుకుంది. తన వలపు వలలో బంధించి కోట్లు దండుకుని ఉన్నదంతా ఊడ్చేసి.. చివరకు రాముని అప్పుల పాలు చేసింది. మరోవైపు హిమాంబితో మోజు తీరిపోయిన రాము.. ఆమె కూతురు నసీమాపై కన్నేశాడు. తనతో పడక సుఖం కావాలని నేరుగా తల్లి హిమాంబీతోనే మనసులో ఉన్న మాట చెప్పి చూశాడు. అయితే.. అందుకు తాను ఒప్పుకోలేదు. నా కూతురు అలాంటిది కాదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. అదేమీ పట్టంచుకోని రాము మాత్రం నసీమాను తరుచూ వేధించడం స్టార్ట్‌ చేశాడు. దీంతో ఉన్నడబ్బంతా ఊడ్చేశాక రాముతో పనేముంది అనుకున్న హిమాంబి అతడి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అందుకు రాము స్నేహితులు, తన కూతురునే వాడుకుని మర్డర్‌ సీన్‌కు తెరలేపింది.

రాముతో కొంతకాలం స్నేహంగా ఉన్న మణికంఠతో జువ్వ ఆట కారణంగా వివాదాలు మొదలయ్యాయి. జువ్వ ఆటతో రాము కోట్లు గడిస్తుంటే.. ఆ ఆట తనకు అంతగా కలిసిరాకపోవడంతో ఈర్ష్య పెంచుకున్నాడు మణికంఠ. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో.. మణికంఠను తీవ్రంగా కొట్టడమే కాకుండా కారుతో ఢీకొట్టి చంపాలనుకున్నాడు రాము. లక్కీగా మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో రాముపై కక్షను పెంచుకుని.. అతన్ని చంపేందుకు సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఇంతలోనే హిమాంబి కూతురు నసీమాతో మణికంఠ ఫ్రెండ్‌ అయిన వినోద్‌ ప్రేమలో పడ్డాడు.

ఈ ప్రేమాయణంలో రాము తనను వేధించిన విషయాన్ని వినోద్‌తో చెప్పడంతో రాముపై కక్ష పెంచుకున్నాడు. ఇటు హిమాంబి, అటు మణికంఠ, వినోద్‌లు ఎలాగైనా రాముని చంపాలన్న ప్లాన్‌లో పడ్డారు. ఇందుకోసం ముగ్గురు కలిసి నసీమాను రంగంలోకి దించారు. నమీమా ద్వారా హనీట్రాప్‌తో రాముని హిమాంబి ఇంటికి రప్పించారు. అప్పటికే నసీమాపై మోజుతో ఉన్న రాము.. హిమాంబి ఫోన్‌తో ఆమె ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ప్లాన్‌లో ఉన్న హిమాంబి విషయాన్ని కాస్తా వినోద్‌, మణికంఠలకు చేరవేసింది. రౌడీ షీటర్‌ జిలానీసహా గ్యాంగ్‌ ద్వారా రాముని మర్డర్‌కు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో వారంతా హిమాంబి ఇంట్లో దిగిపోయారు.

11 మంది రాముపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి.. మర్మాంగాలను కోసేసి హతమార్చారు. అంతటితో ఆగకుండా తమ కక్ష తీరడంతో రాంరెడ్డినగర్‌లో బార్‌ వద్ద సంబురాలు చేసుకున్నారు మణికంఠ, వినోద్‌. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. నిందితులైన హిమాంబి, ఆమె కూతరుతోపాటు మణికంఠ, వినోద్‌, రౌడీషీటర్‌ జిలానీలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×