EPAPER

After Workout : జిమ్ తర్వాత.. వీటిని టచ్ చేయకండి..!

After Workout : జిమ్ తర్వాత.. వీటిని టచ్ చేయకండి..!

Workout: ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కోరుకోవడమే కాదు.. దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా తీసుకోవాలి. అప్పుడే జిమ్‌కి వెళ్లినా ప్రయోజనం ఉంటుంది. లేదంటే ఎన్ని వర్కౌట్లు చేసిన వేస్టే. బాడీ మంచి షేప్‌లో ఉండాలంటే ఎక్సర్‌సైజ్ ఒక్కటే సరిపోదు. దానితో పాటు మంచి డైట్ కూడా తీసుకోవాలి. మంచి పౌష్టికాహారం లేకుండా ఎంత ట్రై చేసినా మీ శరీరం షేప్ సరిగా రాదు. జిమ్‌కి వెళ్లే ముందు తినడానికి కొన్ని మంచి ఆహారాలు ఉన్నట్లే.. చెడు ఆహారాలు కూడా ఉన్నాయి. వాటిని జిమ్ చేసిన తర్వత అసలు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


మీకు తెలుసుగా.. జిమ్‌కు వెళ్లే వాళ్లు మాంసం ఎక్కువగా తినాలని అందరూ అంటుంటారు. కానీ నిజానికి దీనిలో వాస్తవం లేదు. బరువు పెరగాలంటే జిమ్ తర్వాత రెస్ట్ తీసుకోండి. బరువు తగ్గేందుకు మీరు జిమ్‌కు వెళ్తుంటే.. మాంసాహారానికి దూరంగా ఉండంటి. ఎందుకంటే ఈ ఆహారం జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. వీటికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బెటర్.

Read More : వైట్‌రైస్ తినడం ఆరోగ్యకరమా..!


ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఫ్రై ఫుడ్స్ అసలు తీసుకోకండి. ఫ్రైడ్ ఫుడ్స్ జీర్ణం అయ్యేందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటాయి.కండరాలకు పోషకాలు చేరేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీని ద్వారా శరీర ఆకృతి విషయంలో అసంతృప్తి చెందుతారు. అందుకే ఫ్రై చేసిన ఆహారాన్ని ముట్టుకోవద్దు.

ఎక్సర్‌సైజ్ తర్వాత రీఫ్రెష్‌మెంట్ కోసం చాలా మందికి కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. ఇది చాలా చెడ్డ అలవాటు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ మీ శరీరంలోని కార్బొహైడ్రేట్‌లు, కొవ్వులను కరిగిస్తున్నప్పుడు.. మీరు తాగే కూల్‌డ్రింక్స్ దానిని అడ్డుకుంటుంది. కూల్‌డ్రింక్స్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. వీటి బదులుగా సహజ పండ్ల రసాన్ని తీసుకోండి.

ఫాస్ట్‌ఫుడ్స్ నుంచి వచ్చే వాసన మిమ్మల్ని తినమని ప్రేరేపిస్తుంది. మీరు ఆ ఫుడ్స్ మాయలో పడి అసలు తినొద్దు. ఎక్సర్‌సైజ్ తర్వాత ఫాస్ట్‌ఫుడ్ తింటే.. మీ శరీరానికి ఎటువంటి ఫలితం ఉండదు. మీకు అంతగా తినాలని ఉంటే ఏదైనా ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బెటర్.

ఎక్సర్‌‌సైజ్ తర్వాత ఉడించిన గుడ్లను తినండి. వీటిలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి.కానీ ఎగ్ ఆమ్లేట్ అసలు తినొద్దు. వేయించిన ఎగ్ వల్ల కొవ్వులు శరీరంలోకి వెళ్తాయి. గుడ్లను పచ్చిగా తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మేలు.

జిమ్ తర్వాత చాలా మంది పచ్చి కూరగాయలు తినమని చెబుతుంటారు. కానీ అది ఉత్తమమైన నిర్ణయం కాదు. పచ్చి కూరగాయలు శరీరానికి సరిపడ పోషకాలను అందించవు. ఎక్సర్‌సైజ్ తర్వాత శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కేలరీలు ఎక్కువగా అవసరం. పచ్చికూరగాయలు తక్కువగా తిన్నా.. కడుపు నిండిన అనుభూతిని ఇస్తాయి. కాబట్టి ఎక్కువ తినలేరు. దీనివల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు.

Read More : ఈ బ్రేక్‌‌ఫాస్ట్‌తో బరువు తగ్గండి..!

జిమ్‌ చేసేవాళ్లు కచ్చితంగా తినకూడనవి స్వీట్స్. ఎందుకంటే వీటిలో అధిక మొత్తం చక్కెర ఉంటుంది. ఇవి శరీరానికి చాలా హాని చేస్తాయి. ఎక్సర్‌సైజ్ తర్వాత మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి కావాల్సిన పోషకాలు ఇందులో అసలు దొరకవు. ప్రోటీన్లు ఉండే ఫుడ్ తీసుకుంటే బెటర్.

ఎక్సర్‌సైజ్ తర్వాత నీరు కూడా తాగొద్దు. అందులోనూ చల్లని నీరు అసలు వద్దు. జిమ్ తర్వాత చిన్న విరామం తీసుకొని నీరు తాగండి. ఎక్సర్‌సైజ్ తర్వాత హైడ్రేషన్ చాలా అవసరం. కాబట్టి ఎక్కువ నీరు తాగితే ఏమి తినలేరు. ఇది శరీరానికి సరైన పోషకాలు అందకుండా చేస్తుంది. అందుకే వ్యాయామం తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చి.. తినండి.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×