EPAPER

TDP Janasena BJP Alliance: చంద్రబాబు స్కెచ్చా..? పవనే సెట్ చేశాడా?

TDP Janasena BJP Alliance: చంద్రబాబు స్కెచ్చా..? పవనే సెట్ చేశాడా?
TDP Janasena BJP Alliance

TDP Janasena BJP Alliance(Andhra politics news): ఏపీలో పాత పొత్తు కొత్తగా పొడిచే సమయం ఆసన్నమైంది. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ చేరడం ఖాయమని తేలిపోయింది. ఇన్నాళ్లూ టీడీపీతో పొత్తుకు ససేమిరా అన్న బీజేపీ వెనక్కి తగ్గింది. టీడీపీతో మళ్లీ దోస్తికి ద్వారాలు తెరిచింది. మరి బీజేపీ-టీడీపీ మధ్య గ్యాప్ ను ఎవరు పూడ్చారు? ఇదే టాపిక్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది.


ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. అప్పుడే పొత్తుపై క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఏపీ పొత్తులపై అమిత్ షా చేసిన కామెంట్స్ తో టీడీపీ-బీజేపీ మధ్య మళ్లీ స్నేహం కుదిరిందని తేలిపోయింది. మరి ఈ పొత్తు పొడిచేలా చేయటంలో ఎవరు కీలకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూ టీడీపీతో జతకట్టారు. 3 పార్టీల మధ్య పొత్తుల కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కాషాయ పెద్దలను ఒప్పించే ప్రయత్నాలు చేశారని చాలాసార్లు వార్తలు వచ్చాయి. పవనే ఢిల్లీ పెద్దలను ఒప్పించారా?

Read More: ఏపీపై బీజేపీ త్రిశూలవ్యూహం.. మూడు స్తంభాలాట..


చంద్రబాబు అరెస్ట్ సమయంలో అయితే పవన్ కల్యాణ్ మరో అడుగు ముందుకు వేశారు. అంతకుముందు నుంచి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా.. టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలపోనివ్వని ప్రకటించారు. బీజేపీ కూడా కలిసి రావాలని కోరారు. ఈ విధంగా బంతిని బీజేపీ కోర్టులోకి వేశారు. ఆ సమయానికి టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని క్లారిటీ వచ్చింది. కానీ బీజేపీ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. బీజేపీ నేతలు తమకు జనసేన మిత్రపక్షమేనని పదేపదే చెబుతూ వచ్చారు. పొత్తులపై ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. అప్పుడు ఢిల్లీ నుంచే పొత్తులపై సిగ్నల్ వచ్చేసింది.

మరి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై అధికారిక ప్రకటన మాత్రమే రావాలి. ఈ పార్టీలు 2014లో కూటమిగా ఉన్నాయి. మళ్లీ ఇదే కాంబినేషన్ లో వచ్చేందుకు దాదాపు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. మరి బీజేపీ పెద్దలను ఒప్పించి పవన్ కల్యాణ్ ఈ పొత్తును సెట్ చేశారా? రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు వేసిన స్కేచ్ వర్కవుట్ అయ్యిందా? పవన్ ను రాయబారిగా పెట్టి బాబే వెనుక నుంచి గేమ్ నడిపించారా? 2019 వరకు టీడీపీలో కీలకంగా వ్యవహరించిన సుజనా చౌదరి, సీఎం రమేష్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఈ నేతలు ఇద్దరు చంద్రబాబు అత్యంత సన్నిహితులు. మరి వారిద్వారానే టీడీపీ అధినేత వ్యవహారం నడిపారా? ఏదిఏమైనా పవన్ కోరుకున్న విధంగా ఏపీలో పొత్తు పొడవబోతోంది. మరి 2014 ఫలితాలు 2024లో రిపీట్ అవుతాయా?

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×