EPAPER

Under-19 World Cup 2024: అండర్ 19 వరల్డ్ కప్ నుంచి.. టీమ్ ఇండియా వరకు..

Under-19 World Cup 2024: అండర్ 19 వరల్డ్ కప్ నుంచి.. టీమ్ ఇండియా వరకు..
Sports news in telugu

Under-19 World Cup 2024(Sports news in telugu): టీమ్ ఇండియా కుర్రాళ్లకు అన్ని మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అండర్-19 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా అనే సంగతి అందరికీ తెలిసిందే. 2022లో యశ్ ధుల్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో గెలిచి ఐదోసారి గెలిచిన జట్టుగా ఘనకీర్తి సాధించింది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఉదయ్ సహరన్ ఉన్నాడు.


భారత్ నుంచి 2000లో మహ్మద్ కైఫ్, 2008లో విరాట్ కోహ్లీ, 2012లో ఉన్ముక్త్ చంద్, 2018లో పృథ్వీ షా, 2022లో యశ్ ధుల్ సారథ్యంలో వరల్డ్ కప్ గెలిపించారు. ఇప్పుడు 2024లో ఉదయ్ వీరి సరసన చేరతాడో లేదో వేచి చూడాలి.

అండర్ 19 నుంచే పలువురు క్రికెటర్లు నేషనల్ టీమ్‌లో ఆడుతున్నారు. తమ జీవిత కాలంలో ఇండియన్ క్రికెట్‌కి కల నెరవేర్చుకోవాలంటే ఇది ఒక వారధి అని చెప్పాలి. అలా ప్రస్తుతం ఆడుతున్న వారిలో యశ్వసి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఆవేశ్ ఖాన్, కులదీప్ యాదవ్ వీరందరూ ఉన్నారు. అంతెందుకు ఇప్పుడు ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ సైతం అండర్ 19కి ఆడి ఇటు వచ్చి జాతీయ జట్టులో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు.


Read More:Australia Vs India Under-19: అండర్ 19.. రేపే ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్..

అండర్ 19 టీమ్ ఇండియా స్క్వాడ్‌లో జాతీయ జట్టులోకి వచ్చేది ఒకరు, ఇద్దరు మాత్రమే. అయితే అతికష్టమ్మీద ఒకే ఒక్కసారి మాత్రం 2014లో ఎక్కువమంది వచ్చారు. ఆవేశ్ ఖాన్, కులదీప్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, సర్ఫరాజ్ ఖాన్ (ఇంకా ఆరంగ్రేటం కాలేదు).

2024లో అండర్ 19లో ప్రస్తుతం  ఐదుగురు అద్భుతంగా ఆడుతున్నారు.  ముషీర్ ఖాన్, కెప్టెన్ ఉదయ్ సహరన్, సచిన్ దాస్, పేసర్ నమన్ తివారి, మీడియం పేసర్ రాజ్ లింబాని. మరి వీరిలో ఎంతమందికి జాతీయ జట్టు నుంచి పిలుపు వస్తుందంటే చెప్పడం కష్టమేనని, అయితే ఫైనల్‌లో గెలిచిన తర్వాత అంచనా వేయవచ్చునని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.

Tags

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×