EPAPER

Rajinikanth Remuneration: మెంటలెక్కిస్తున్న రజనీకాంత్ రెమ్యునరేషన్..‘లాల్ సలాం’ కోసం నిమిషానికి కోటి!

Rajinikanth Remuneration: మెంటలెక్కిస్తున్న రజనీకాంత్ రెమ్యునరేషన్..‘లాల్ సలాం’ కోసం నిమిషానికి కోటి!
rajinikanth lal salaam

Rajinikanth Remuneration for Lal salaam: సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మూవీ చేశాడు. అయితే ఈ మూవీలో రజనీ చిన్న గెస్ట్ రోల్ చేసినందుకుగానూ ఎవరూ ఊహించని రెమ్యునరేషన్ తీసుకున్నారడట. ఈ విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. మరి ఏ మేరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసుకుందాం….


కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీకి ముందు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్‌ అయ్యాయి. అయితే అప్పటికే రజనీతో పాటు ఆయన ఫ్యాన్స్ మంచి హిట్ కోసం ఎదురుచూశారు. జైలర్ మూవీతో వారి ఆకలి తీరిపోయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అటు రజనీకాంత్‌కు, ఇటు అభిమానులకు మంచి ఎనర్జీని ఇచ్చింది.

ఈ మూవీ హిట్‌తో రజనీకాంత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ మూవీ చేశాడు. అయితే ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ మూవీ పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో రన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో రజనీకాంత్ రెమ్యూనరేషన్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ఈ మూవీకి తీసుకున్న పారితోషికం తెలిసి అంతా షాక్ అవుతున్నారు.


READ MORE: Lal Salaam Review: లాల్ సలాం రివ్యూ.. రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా..? ఫుల్ లెంత్ పాత్రనా..?

క్రికెట్, పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో రజనీకాంత్.. మోయినుద్దీన్ భాయ్ పాత్ర పోషించారు. ఈ పాత్రలో రజనీ గెటప్ అందరినీ ఆకర్షించింది. ఇందులో ఆయన పాత్ర ఒక ముస్లిం వర్గానికి పెద్దగా.. పారిశ్రామికవేత్తగా కనిపిస్తారు. అంతేకాకుండా తన ఊరిమీద విపరీతమైన అభిమానం ఉన్న వ్యక్తిగా.. ఒక క్రికెట్ అభిమానిగా కూడా రజనీ ఈ మూవీలో కనిపించి మెప్పించారు.

ఇక విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవితా రాజశేఖర్ ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా గెస్ట్ రోల్ ప్లే చేశారు. కాగా ఈ మూవీలో రజనీకాంత్ పాత్ర చాలా తక్కువ నిడివితో ఉంటుంది. కేవలం 30 నుంచి 40 నిమిషాల వరకు సాగుతుంది. అయితే ఇది కీలకమే అయినప్పటికీ ఈ నిడివితో కూడుకున్న పాత్రకోసం రజనీకాంత్ ఏకంగా రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే నిమిషానికి కోటి రూపాయలు చొప్పున తీసుకున్నారన్న మాట.

READ MORE: Rajinikanth:- మ‌ళ్లీ ముంబై భాయ్‌గా త‌లైవ‌ర్‌.. ‘లాల్ సలాం’లో మాస్ లుక్

అయితే ఒక గెస్ట్ రోల్ కోసం నిమిషానికి కోటి రూపాయలు పుచ్చుకున్న రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీ కోసం ఎంత తీసుకుంటాడో అన్న విషయంపై కూడా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×