EPAPER

Sivabalakrishna : శివబాలకృష్ణ అవినీతి కేసు.. తెరపైకి IAS.. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

Sivabalakrishna : శివబాలకృష్ణ అవినీతి కేసు.. తెరపైకి IAS.. ఏసీబీ దర్యాప్తు ముమ్మరం
Siva balakrishna case latest news

Siva balakrishna case latest news(Telangana today news): శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. శివ బాలకృష్ణ కన్ఫెన్షన్ స్టేట్మెంట్ రిపోర్టులో ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు చేర్చింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఒత్తిడితోనే అనుమతులు ఇచ్చానని శివ బాలకృష్ణ ఒప్పుకున్నారు. అరవింద్ కుమార్‌కు కోట్ల రూపాయలు ముట్ట చెప్పినట్టు అధికారుల వద్ద చెప్పారు. అరవింద్ కుమార్‌ను విచారించేందుకు ఏసీబీ.. ప్రభుత్వ అనుమతి కోరింది. శివ బాలకృష్ణ అనుమతులిచ్చిన ఉత్తర్వులు తేదీ, అరవింద్ కుమార్ ఆస్తులు కొనుగోలు తేదీని ఏసీబీ అధికారులు పరిశీలించారు.


ప్రభుత్వం అనుమతి ఇస్తే అరవింద్‌కు నోటీసులు ఇచ్చి ఏసీబీ విచారణ జరపనుంది. శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్‌ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. బాలకృష్ణకు సంబంధించి మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశముంది. చంచల్ గూడ జైలులో శివ బాలకృష్ణకు జైలు అధికారులు భద్రత పెంచారు. శివ బాలకృష్ణ ఉండే బ్యారక్‌లో సీసీ కెమెరాలతో పాటు 24 గంటలు పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

Read More : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం..


HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ బాధితులు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. శివబాలకృష్ణ వల్ల భూమిని కోల్పోయామని కొందరు బాధితులు బిగ్‌ టీవీని ఆశ్రయించారు. కబ్జా అయిన తమ భూముల్లో లేఔట్‌కు శివబాలకృష్ణ అనుమతి ఇచ్చారని వాళ్లు ఆరోపిస్తున్నారు. ఆయన తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాలాపూర్‌ పహాడీ షరీఫ్‌ దర్గా దగ్గర సర్వే నంబర్‌ 145/Pలో ఉన్న భూమిని 1950లో ఆనాటి ప్రభుత్వం కౌలు రైతులకు కేటాయించింది. ఆ భూమికి 1987లో వారసత్వ లీగల్‌ పత్రాలు కూడా జారీ అయ్యాయి. మొత్తం భూమిని 13 కుటుంబాలకు సమానంగా ఇచ్చారు. అయితే ఆ భూమి తనదేనంటూ 2006లో ఓ వ్యక్తి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదే అదనుగా VNR ఏరో సిటీ డెవలపర్స్ అధినేత వేంరెడ్డి నర్సింహారెడ్డి ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు.

ఆ భూమిలో 230 ఎకరాలు తనదేనంటూ కబ్జా కూడా చేసేశారు. దీంతో భూ యజమానులు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే 90 ఎకరాల్లో లే ఔట్‌ అనుమతి కోసం 2019లో నర్సింహారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. 2020లో డ్రాఫ్‌ లేఔట్‌కు అనుమతి కూడా తెచ్చేసుకున్నారు. శివబాలకృష్ణే లే ఔట్‌కు అనుమతులిచ్చాడని, కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే లేఔట్‌కు ఎలా అనుమతి ఇస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×