EPAPER

Australia Vs India Under-19: అండర్ 19.. రేపే ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్..

Australia Vs India Under-19: అండర్ 19.. రేపే ఆస్ట్రేలియా-ఇండియా ఫైనల్..

Australia Vs India ICC Under-19 World Cup Final : అండర్ 19లో కుర్రాళ్లు దుమ్ము దులిపి మళ్లీ ఫైనల్స్‌లో చేరారు. ఆదివారం సౌతాఫ్రికాలోని విల్లోమూర్ పార్క్ బెనోనిలో జరగనుంది. ఇప్పటివరకు టీమ్ ఇండియా యువ జట్టు ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో తలపడనున్న ఆస్ట్రేలియా మూడు సార్లు ప్రపంచ కప్ కొట్టింది. ఈ లెక్కన చూస్తే ఆస్ట్రేలియాను టీమ్ ఇండియా తేలికగా తీసుకోకూడదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు.


ఇంతవరకు అండర్ 19 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా యువ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓటమి అన్నదే ఎరగకుండా ఫైనల్‌కి చేరింది. భారీ రన్స్ తేడాతో లీగ్ దశలో గెలిచినప్పటికీ.. సెమీఫైనల్‌లో మాత్రం తడబడింది. చివరకు దాస్, కెప్టెన్ ఉదయ్ ఇద్దరూ సమయోచితంగా ఆడి మ్యాచ్‌ను విజయ తీరాలకు చేర్చారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.

Read More: SL vs AFG: నిస్సంక డబుల్ సెంచరీ.. ఆఫ్గనిస్తాన్‌‌పై లంక ఘనవిజయం..


ఆస్ట్రేలియా అయితే టోర్నీ ఆసాంతం తడబడుతూనే గెలుస్తూ వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ వరకు విజయం దోబుచులాడుతూనే ఉంది. ఎట్టకేలకు 3 రన్స్ 6 బాల్స్ చేయాల్సిన పరిస్థితుల్లో ఒక ఫోర్ రావడంతో చచ్చీచెడి ఫైనల్‌లో అడుగు పెట్టింది.

ఈ లెక్కన, అంకెలన్నీ చూస్తే ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్ భారత్ లాగే కనిపిస్తోంది. అంతేకాదు ఒత్తిడిలో నుంచి కూడా ఒడ్డున పడగలదని సెమీఫైనల్ మ్యాచ్‌లో నిరూపించింది. అందువల్ల కచ్చితంగా టీమ్ ఇండియా ఆరోసారి కూడా కప్ గెలిచి విజయ ఢంకా మోగిస్తుందని క్రీడా విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

జట్టు సమీకరణాలు, ఆటగాళ్ల సెంచరీలు, విజయాలు ఇలాంటి లెక్కలు, ఆటలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆఖరి వరకు పోరాడటమే కంగారుల నైజం. 2023 వన్డే వరల్డ్ కప్‌లో సీనియర్ జట్టుకి తగిలిన గాయం ఎవరూ మరిచిపోలేనిది. మరొక్కసారి ఆస్ట్రేలియా-ఇండియా యువ జట్టు కూడా తలపడటంతో ఆ చేదు జ్నాపకాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి మరీ కుర్రాళ్లు ఆ కోరిక తీర్చి, భారతీయులకు ఒక బహుమతినిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×