EPAPER

TS Cabinet : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం..

TS Cabinet : ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం..

TS Cabinet Approved the Budget(Political news in Telangana): శనివారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం.. నూతన బడ్జెట్ కు ఆమోదముద్ర వేసింది. ఈ బడ్జెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్ ఉండనుంది.


ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలుకు కూడా నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఈసారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో.. తొలి మూడునెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్ లో ఉండనున్నాయి. ఆ తర్వాత రేవంత్ సర్కార్.. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.

Read More : త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. వయోపరిమితి పెంపు..


తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్‌ ప్రవేశపెడుతుండటంతో.. ఈ బడ్జెట్‌పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు ప్రాధాన్యత కల్పించి, హామీల అమలుకే 70 వేల కోట్లు కేటాయించినట్టు సమాచారం. రైతు భరోసాతో పాటు వ్యవసాయ రంగానికి 30 వేల కోట్లు.. ఇళ్లు, వ్యవసాయానికి ఫ్రీ కరెంట్‌ కోసం 20 వేల కోట్లు, పెన్షన్ల కోసం 30 వేల కోట్లు, ఇందిరమ్మ హౌసింగ్‌కు 15 వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్‌ ఇన్‌ ఎయిడ్‌లు, పన్ను వాటాలు రాకపోవడంతో.. మోడీ సర్కార్‌పై ఆశ పెట్టుకోకుండా.. వాస్తవిక అంచనాలకు తగ్గట్టుగానే బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం.

ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కొత్త ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులే ఉంటాయని తెలుస్తోంది. సాధారణంగా జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2024-25కి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. బీఏసీ సమావేశంలోనూ ఇదే చర్చించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. తొలిసారి ప్రతిపక్ష నేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Tags

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×