EPAPER

Telangana Budget 2024-25: నేడే బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి

Telangana Budget 2024-25: నేడే బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న భట్టి
Telangana Budget 2024-25

Telangana Budget 2024-25(Telangana news live): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆ తర్వాత కౌన్సిల్‌లో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. మళ్లీ జూన్ నెలలో పూర్తిస్తాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్లనుంది. ముందుగా శనివారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రి మండలి భేటీ అయ్యి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.


2.95 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపైనే ఉండనుంది. దాదాపు 70 వేల కోట్లు ఈ ఆరు గ్యారంటీల అమలుకు కేటాయించే వీలుంది. వ్వవసాయ రంగానికి 30 వేల కోట్లు వరకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Read More: త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్.. వయోపరిమితి పెంపు..


సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేయనుంది. దాదాపు 40 వేల కోట్లు సంక్షేమ రంగానికి కేటాయించనున్నట్లు సమాచారం. రూరల్ డెవలప్‌మెంట్, పంచాయితీ రాజ్ శాఖలకు రూ.30 వేల కోట్ల కేటాయింపులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇరిగేషన్ శాఖకు రూ. 29 వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 18 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ , రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలు ఆశించిన మేరకు రాకపోవడంతో కేంద్రంపై ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా బడ్జెట్‌ను రూపొందించారు.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×