EPAPER

Moto G04 Launch India: డెడ్ చీప్ ధరలోనే Moto G04 5G స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే.?

Moto G04 Launch India: డెడ్ చీప్ ధరలోనే Moto G04 5G స్మార్ట్‌ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే.?
Moto G04 Launch India

Moto G04 Launch in India:


ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. బడ్జెట్, అద్భుతమైన ఫీచర్లు, యూజర్ సేప్టీను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అలాంటి స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ మధ్య చాలా మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరో ఫోన్ అందరినీ ఆకట్టుకోవడానికి రెడీ అయింది.

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. ‘మోటో జీ04’ పేరుతో కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ మొబైల్ జాబితా తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అయింది. దీని ప్రకారం చూస్తే..


మోటో జీ04 మొబైల్ ఫిబ్రవరి 15న ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోన్ మొత్తం 2 స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. అందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్.. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వంటి వేరియంట్లలో దర్శనమివ్వనుంది. ఈ ఫోన్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. అయితే మోటోరోలా కంపెనీ మాత్రం మోటో పేరును ఎక్కడా బహిర్గతం చేయలేదు. తన రాబోయే ఫోన్ గురించి మాత్రమే కంపెనీ రివీల్ చేసింది. అది మోటో జీ04 మోడల్ కూడా కావచ్చని తెలుస్తోంది.

ధర:

ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. యూరోప్‌లో ఈయూఆర్ 119గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. సుమారు రూ.10,751 అన్నమాట. ఈ ధరే కనుక ఒకే అయితే 5జీ నెట్‌వర్క్‌లో తక్కువ ధరకే లభ్యమవుతున్న ఫోన్ ఇదే అవుతుంది.

అంతేకాకుండా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిగతా కంపెనీలకు పోటీదారుగా నిలవనుంది. మంచి కండీషన్ గల స్మార్ట్‌ఫోన్‌ను కొనాలను చూస్తున్నట్లయితే మోటో జీ04 మొబైల్ బెస్ట్ అని చెప్పాలి.

స్పెసిఫికేషన్స్:

మోటో జీ04 5జీ మొబైల్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6.6 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించనుంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్ ఈ ఫోన్‌కు మరింత పవర్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా రన్ అవుతుంది. ఇది 15జీబీ వరకు ర్యామ్ సపోర్ట్ ఇస్తుంది.

5000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా మెరుగైన ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, డాల్బీ అట్మోస్‌ను అమర్చారు. ఫోన్ వెనుకవైపు 16 ఎంపీ ఏఐ కెమెరా.. పోర్ట్రెయిట్ మోడ్‌ను కలిగిఉంది.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×