EPAPER

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు .. ఆ సర్వీసులన్నీ రద్దు

Train accident : రాజమండ్రి స్టేషన్ సమీపంలో బాలాజీపేట వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా పట్టాలు తప్పింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు


9 సర్వీసులు రద్దు..
గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అలాగే 9 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో రెండు సర్వీసులను పాక్షికంగా రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డీఆర్‌ఎం ట్వీట్‌ చేశారు. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

రద్దైన రైళ్ల వివరాలు..
విజయవాడ- విశాఖపట్నం, గుంటూరు-విశాఖపట్నం, విజయవాడ-కాకినాడ పోర్టు మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. విజయవాడ- లింగంపల్లి రైలు ఆలస్యంగా నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు.


విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు
గుంటూరు-విశాఖ, విశాఖ-గుంటూరు రైళ్లు రద్దు
గుంటూరు-విజయవాడ, కాకినాడ పోర్టు-విజయవాడ రైళ్లు రద్దు
కాకినాడ పోర్టు-విజయవాడ రైలు పాక్షికంగా రద్దు.
విజయవాడ-రాజమండ్రి రైలు పాక్షికంగా రద్దు

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×