EPAPER

Bharat Ratna for PV Narasimahrao: తొలి తెలుగు భారతరత్నం.. ఇన్నాళ్లుకు పీవీకి దక్కిన గౌరవం!

Bharat Ratna for PV Narasimahrao: తొలి తెలుగు భారతరత్నం.. ఇన్నాళ్లుకు పీవీకి దక్కిన గౌరవం!

Modi’s Government Announced Bharata Ratna Award to PV Narasimahrao: దేశ మాజీ ప్రధానమంత్రులైన పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ లకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వారితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ఈ అత్యున్నతమైన భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసింది.


పీవీ విద్య, రాజకీయ జీవితం..

పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో.. రుక్నాబాయి-సీతారామారావు దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య తర్వాత.. పాములపర్తి రంగారావు – రుక్మిణమ్మలు దత్తత తీసుకోవడంతో.. ఇంటిపేరు పాములపర్తిగా మారింగి. 1938లోనే హైదరాబాద్ లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. అప్పటి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడారు. దాంతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆయనను బహిష్కరించారు. ఆ తర్వాత స్నేహితుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి.. 1940-1944 వరకూ ఎల్ఎల్ బీ చదివారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన ఆయన.. ఉమ్మడి ఆఁధ్రప్రదేశ్ పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ నియోజకవర్గం నుంచే వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికై.. 1962లో తొలిసారి న్యాయ, సమాచార శాఖ మంత్రి అయ్యారు. 1964-1967 వరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, 1968-71 వరకూ న్యాయ, సమాచారశాఖ మంత్రిగా పదవులు నిర్వహించారు.


1971 సెప్టెబర్ 30న ముఖ్యమంత్రి పదవిని చేపట్టీ పట్టగానే.. కాంగ్రెస్ లో అసమ్మతి తలెత్తింది. ఆయన పదవీకాలంలో ఢిల్లీ-హైదరాబాద్ ల మధ్య రాకపోకలే ఎక్కువగా ఉన్నాయి. ఆయన హయాంలో శాసనసభ ఎన్నికల్లో 70 శాతం వెనుకబడిన వారికిచ్చి చరిత్రసృష్టించారు. 1977లో మొదటి, రెండోసారి లోక్ సభకు హనుమకొండ నుంచి, మూడోసారి, నాల్గవసారి లోక్ సభకు మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎన్నికయ్యారు. 1991లో జరిగిన ఉపఎన్నికలో నంద్యాల పార్లమెంట్ నుంచి పోటీ చేసి.. 10వ లోక్ సభలో అడుగుపెట్టారు. 1971-1973 వరకూ ఏపీ ముఖ్యమంత్రిగా, 1986 మార్చి 12 నుంచి 1986 మే 12 వరకూ హోం శాఖ మంత్రిగా పనిచేశారు. 1991 – 1996 వరకూ భారతప్రధానిగా పనిచేసిన ఆయన.. అనేక సంస్కరణలకు నాంది పలికారు.

చరణ్ సింగ్..

భారతరత్న అందుకున్న ప్రధానులలో మరొక మాజీ ప్రధాని చరణ్ సింగ్. 1902 ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లా నూర్ పూర్ గ్రామంలో జన్మించారు. మహాత్మాగాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. 1931 నుంచి జాతీయ కాంగ్రెస్ లో క్రియా శీలకంగా ఉన్నారు. 1937లో యునైటెడ్ ప్రొవిన్సెస్ శాసనసభలో సభ్యుడిగా ఉన్నారు. 1967 ఏప్రిల్ 1 న కాంగ్రెస్ నుండి వైదొలగి, ప్రతిపక్ష పార్టీలో చేరారు. 1967 ఏప్రిల్ 3 నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకూ యూపీ ముఖ్యమంగా పనిచేశారు. ఆ తర్వాత 1977 మార్చి 24 నుంచి 1978 జులై 1 వరకూ భారత హోం మంత్రిగా, 1977 మార్చి 28 నుంచి 1979 జులై 28 వరకూ.. 3వ ఉపప్రధాన మంత్రిగా, 1979 జనవరి 24 నుంచి 1979 జులై 28 వరకు భారత ఆర్థిక శాఖ మంత్రిగా, 1980 జనవరి 14 నుంచి 1979 జులై 28 వరకు భారతదేశ 5వ ప్రధాన మంత్రిగా సేవలందించారు. 1987 మే 29న 84 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు.

ఎంఎస్ స్వామినాథన్..

ఎంఎస్ స్వామినాథన్.. 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. 1943లో బెంగాల్ లో వచ్చిన కరువు.. అతనిని కదిలించింది. కుటుంబంలో వైద్యులు ఉండటంతో.. మెడికల్ పాఠశాలలో చేరినా.. ఆ తర్వాత వ్యవసాయ రంగానికి మారిపోయారు. కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశారు. జంతుశాస్త్రంలో బీఎస్సీ డిగ్రీ పట్టా అందుకున్నారు. 1951లో కేం బ్రిడ్జి యూనివర్సిటీలో చదివారు.
1949-55 బంగాళదుంప, గోధుమ, వరి, జనపనార జన్యువులపై పరిశోధన, 1955-72 మెక్సికన్ మరగుజ్జు గోధుమ వంగడాలపై పరిశోధన చేశారు.

Related News

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Big Stories

×