EPAPER

BHIM UPI Cashback Offer: UPI యూజర్లకు బంపరాఫర్.. భీమ్ UPI పేమెంట్ లతో రూ.750 వరకు క్యాష్‌బ్యాక్!

BHIM UPI Cashback Offer: UPI యూజర్లకు బంపరాఫర్.. భీమ్ UPI పేమెంట్ లతో రూ.750 వరకు క్యాష్‌బ్యాక్!

Avail Rs 750 Cashback Offer in BHIM App UPI Payments: యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేటప్పుడు క్యాష్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM).. డిజిటల్ మొబైల్ పేమెంట్స్ యాప్ ప్రస్తుతం తమ వినియోగదారులకు అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దాదాపు రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది. దాంతో పాటుగా అదనంగా 1 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.


యూజర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు భీమ్ ప్లాట్‌ఫారమ్ గూగుల్ పే మాదిరిగానే అనేక ఆఫర్లను తీసుకొస్తోంది. పలు ఆఫర్లతో పాటుగా విభిన్నమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచుతోంది. అయితే ఈ రూ.750 క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: UPI: యూపీఐ పేమెంట్స్‌ చేస్తే ఛార్జీల మోత.. కస్టమర్లకు కేంద్రం వాత..


క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఎలా పొందాలి..?

ఫుడ్ ఆర్డర్స్ లేదా ప్రయాణ ఖర్చుల కోసం ఈ భీమ్(BHIM) యాప్‌ను ఉపయోగించి పేమెంట్ చేసినట్లయితే.. దీని ద్వారా రూ.150 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే ఫుడ్ ఆర్డర్స్, ట్రావెల్ ఖర్చుల కోసం రూ.100 కంటే ఎక్కువ లావాదేవీలు చేసినట్లయితే.. దీని ద్వారా రూ.30 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అంతేకాకుండా రైల్వే టికెట్ల బుకింగ్స్, క్యాబ్ రైడ్‌లు, రెస్టారెంట్ బిల్లు, మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ చేసినట్లయితే ఈ ఆఫర్ వర్తిస్తుంది. గరిష్టంగా రూ.150 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అయితే ఇందుకోసం వినియోగదారుడు కనీసం 5 సార్లు క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది.

రూపే క్రెడిట్ కార్డుతో రూ.600 క్యాష్‌బ్యాక్

రూపే క్రెడిట్ కార్డును భీమ్ యాప్‌కు లింక్ చేయడం వలన మరో రూ.600 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందవచ్చు. కానీ, ఈ ఆఫర్‌ను UPI చెల్లింపుల ద్వారా అన్‌లాక్ చేసుకోవాలి. అది ఎలాగంటే.. మొదటి మూడు లావాదేవీలపై రూ.100 కంటే ఎక్కువ చేస్తే రూ.100 క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత ప్రతీ నెల రూ.200 కంటే ఎక్కువ దాటిన 10 లావాదేవీలపై అదనంగా రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ విధంగా ఈ పేమెంట్లను పూర్తి స్థాయిలో చేయడం ద్వారా మొత్తంగా రూ.600 క్యాష్‌బ్యాక్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు.

READ MORE: Alert For UPI Users: ఫోన్‌పే, గూగుల్ పే, యూజర్లకు బిగ్ అలర్ట్..!

ఫ్యూయల్ పేమెంట్లపై క్యాష్‌బ్యాక్:

భీమ్ యాప్ ఉర్జా (Urja) 1 శాతం స్కీమ్ కూడా అందుబాటులో ఉంచింది. దీని ద్వారా వినియోగదారులు డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీతో పాటు ఇతర అన్ని ఇంధన చెల్లింపులపై 1శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అంతేకాకుండా.. ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్, గ్యాస్ బిల్లుల వంటి చెల్లింపులు రూ.100 కంటే ఎక్కువ చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ అనేది నేరుగా భీమ్ యాప్‌తో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది.

ఆఫర్లు ఎప్పటివరకు..?

ఈ ఆఫర్లు మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అయితే, ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అయ్యేందుకు కనీసం 7 వారాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×