EPAPER

Ayalaan Movie Review: అయలాన్ రివ్యూ.. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్ హిట్ అందుకున్నాడా?

Ayalaan Movie Review: అయలాన్ రివ్యూ.. గ్రహాంతరవాసితో శివకార్తికేయన్ హిట్ అందుకున్నాడా?
Ayalaan Movie Review

Sivakarthikeyan‘S Ayalaan Movie Review:


అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ పరిచయం ఉన్న కథానాయకుడు శివకార్తికేయన్. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన శివకార్తికేయన్.. ఆ తర్వాత నటించిన సినిమాలన్నింటినీ తెలుగులోనూ విడుదల చేస్తూ వచ్చారు. తాజాగా గ్రహాంతరవాసి కాన్సెప్ట్ తో తీసిన అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో తప్పుకోక తప్పలేదు. తమిళనంలో ముందే విడుదలై మంచి టాక్ వచ్చినా.. తెలుగులో రిలీజ్ కు ముందే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. మరి .. గ్రహాంతరవాసి కాన్సెప్ట్ తో వచ్చిన శివకార్తికేయన్ హిట్ అందుకున్నాడా లేదా చూద్దాం.

చిత్రం : అయలాన్
నటీనటులు : శివకార్తికేయన్, వెంకటేష్ సెంగుత్తువాన్, రకుల్ ప్రీత్, శరద్ ఖేల్కర్, ఇషా కొప్పికర్, కరుణాకరన్, యోగిబాబు తదితరులు
సంగీతం : ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
ఎడిటింగ్ : రూబెన్
నిర్మాత : కొట్టపాడి జె.రాజేశ్
రచన, డైరెక్షన్ : ఆర్.రవికుమార్
స్ట్రీమింగ్ పార్ట్నర్ : సన్ నెక్ట్స్


కథలోకి వెళ్తే..

తామిజ్ (Sivakarthikeyan)ఒక సాధారణ రైతు. ప్రకృతికి నష్టం జరగకుండా.. తనకూ నష్టాలు రాకుండా.. ఒక సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటాడు. సహజ ఎరువులతో వ్యవసాయం చేసినా.. తనకు లాభాలకంటే నష్టాలే ఎక్కువ వస్తుంటాయి. ఆశించిన స్థాయిలో దిగుబడి లేక.. అప్పులు పెరిగిపోతుండటంతో.. అతని తల్లి (Bhanupriya)ఉద్యోగం చేయాలని సిటీకి పంపిస్తుంది. అదే సమయంలో.. వాహనాలకు ఫ్యూయల్ కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్ ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్యన్ (sharad kelkar). గ్యాస్ ను వెలికి తీసేందుకు స్పార్క్ అనే గ్రహ శకలాన్ని ఉపయోగిస్తుంటాడు. ఆఫ్రికాలో అతను చేసిన ప్రయోగం వికటించడంతో.. వందలాదిమంది ప్రాణాలు కోల్పోవడంతో ఇండియాలో సీక్రెట్ లో ఒక మైన్ లో తన ప్రయోగాన్ని కొనసాగిస్తుంటాడు.

ఈ క్రమంలో ఆర్యన్ వద్ద ఉన్న స్పార్క్ కోసం.. మరో గ్రహం కోసం టాట్టూ అనే ఏలియన్ భూమ్మీదికి వస్తుంది. ఆ ఏలియన్ తామిజ్ ను ఎలా కలిసింది.. ?ఆర్యన్ గ్యాంగ్ తో ఏలియన్ కు ఎలాంటి సమస్య వచ్చింది. సైంటిస్ట్ ప్రయోగంతో చెన్నైకి వచ్చిన ముప్పేంటి ? అన్న విషయాలు తెలియాలంటే తెరపై పూర్తి సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది ?

సినిమా ఇండస్ట్రీకి ఏలియన్ కాన్సెప్ట్ తో సినిమాలు కొత్తేం కాదు. కాకపోతే ఇవి ఎక్కువగా హాలీవుడ్ లోనే దర్శనమిస్తాయి తప్ప.. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లలో చాలా తక్కువ. అందుకే ఇలాంటి సినిమాల్లో కంటెంట్ ఉంటే గానీ ప్రేక్షకులు కనెక్ట్ అవరు. ఒక ఏలియన్ కథతో.. అయలాన్ సినిమా తీసి.. డైరెక్టర్ రవికుమార్ ప్రేక్షకులు కావలసినంత వినోదాన్ని పంచారు. తమిళ్ మూవీ కావడంతో.. అక్కడక్కడా కాస్త ఓవర్ గా ఉన్నట్లు అనిపించడం కామన్. హీరో ఇంట్రడక్షన్, ఎంట్రీ సాంగ్, డైలాగ్స్ రొటీన్ గానే ఉంటాయి. మొదట్లో సినిమా కాస్త సాగదీతగానే ఉన్న.. ఏలియన్ కథలోకి వచ్చాక ఇంట్రస్టింగ్ గా మారుతుంది. కోయి మిల్ గయా సినిమాలో ఏలియన్ నుంచి హీరోకు శక్తులు రావడం వంటి కాన్సెప్ట్ ను చూపించారు. శివకార్తికేయని వన్ మ్యాన్ షో అయలాన్. తామిజ్ క్యారెక్టర్ కు తను పూర్తి న్యాయం చేశాడు.

ప్లస్ పాయింట్స్

శివకార్తికేయన్, టట్టూ
డైరెక్షన్

మైనస్ పాయింట్స్

అక్కడక్కడా కాస్త ఓవర్ గా అనిపించే సీన్స్

ఒక్కమాటలో చెప్పాలంటే.. అయలాన్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×