EPAPER

TS Assembly Sessions 2024: ఈ రోజే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి!

TS Assembly Sessions 2024:  ఈ రోజే బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి భట్టి!
Telangana news live

Telangana State Assembly Budget Sessions 2024: నేడు తెలంగాణ ఉభయసభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. దీనిపై ప్రభుత్వ సమాధానం ఇవ్వనుంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.. తీర్మానాన్ని బలపరుస్తారు. శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా.. బి. మహేష్ కుమార్ గౌడ్ దానిని బలపరుస్తారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం.. CM రేవంత్​రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు.


గురువారం జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచనున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదికను తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి.. తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉభయసభల ముందు పెట్టనున్నారు.

Read More : మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్.. తప్పంతా వారిదే..


రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం కానుంది. బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్​లో చర్చించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదికపై క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని, హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. రిటైర్డ్ జస్టిస్‌చే విచారణ చేయించాలని సర్కార్ భావిస్తోంది. ఇలాంటి విషయాలపై కేబినేట్​లో చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బడ్జెట్ సమావేశాలు, ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే ఛాన్స్‌ ఉంది.

Tags

Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×