EPAPER

Medigadda Barrage : మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్.. తప్పంతా వారిదే..

Medigadda Barrage : మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్.. తప్పంతా వారిదే..
TS today news

Vigilence Report on Medigadda Barrage(TS today news): బీఆర్‌ఎస్‌ పాపాల పుట్టలో ఒకటైన మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సర్కార్‌ విధించిన విజిలెన్స్‌ విచారణకు సంబంధించిన రిపోర్ట్‌.. బిగ్‌ టీవీ సంపాదించింది. ఈ బ్యారేజ్‌కు సంబంధించి కేసీఆర్‌ సర్కార్‌ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ మొదట అంచనా 2 వేల 472 కోట్లు కాగా.. వాటిని ఏకంగా 133.67 శాతం పెంచి 4వేల 321 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాలను ఆధారాలతో సహా ప్రూవ్‌ చేసింది విజిలెన్స్.


నిధుల పరంగా పరిస్థితి ఇలా ఉంటే డ్యామ్‌ కుంగిపోవడానికి గల అనేక కారణాలు,అనుమానాలను తెరపైకి తీసుకొచ్చింది విజిలెన్స్‌. డ్యామ్‌ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్‌, షీట్ పైల్స్‌ను తొలగించకపోవడం వల్లే పియర్స్‌ కుంగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నదీ సహజ ప్రవాహంపై కాఫర్ డ్యామ్ ప్రభావం పడిందని తేల్చింది. అంతేకాదు డిజైన్‌లో ఉన్నట్లుగా కటాఫ్ వాల్స్‌కు, రాఫ్ట్ వాల్స్‌కు మధ్య నిర్మాణం జరగలేదని కూడా విజిలెన్స్‌ విచారణలో తేలింది.

ఇదే కాకుండా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది విజిలెన్స్ రిపోర్ట్. ఇటీవల లీకైన 6, 7, 8 పిల్లర్లను అస్సలు కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టీ నిర్మించలేదన్న విషయం విచారణలో తేలింది. ఆ పిల్లర్లను సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించిందని.. దీనికి సంబంధించినపూర్తి ఆధారాలను విజిలెన్స్ సేకరించింది.


అసలు 137 శాతం అంచనాలు ఎందుకు పెరిగాయి? పెరిగిన అంచనాల ప్రకారం ఖర్చు చేసిన నిధులు నిజంగానే ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఉపయోగించారా? లేక గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయా? ఎల్‌ అండ్ టీ లాంటి సంస్థ కాకుండా ముఖ్యమైన నిర్మాణాలు సబ్‌ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చారు? దీని వెనకున్న లొసుగులేంటి? అన్న దానిపై విజిలెన్స్ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పుడు విజిలెన్స్‌ రిపోర్ట్‌కు అనుగుణంగా చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రెడీ అవుతోంది.

Related News

Telangana Graduate MLC Election: ఎమ్మెల్సీ‌ ఎన్నిక బీజేపీని జీవన్‌రెడ్డి ఢీ కొడతాడా?

Bhadradri Temple chief priest: భద్రాచలం ప్రధాన అనుచరుడిపై వేటు.. లైంగిక వేధింపులు.. లాగితే విస్తుపోయే నిజాలు!

Hyderabad Metro: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్‌ అకౌంట్‌ హ్యాక్‌..క్లిక్ చేస్తే అంతే!

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

Big Stories

×