EPAPER

Ministers To Meet Farmers: ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

Ministers To Meet Farmers: ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

Ministers To Meet Farmers: పంజాబ్ రైతులు ఫిబ్రవరి 13, మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో తలపెట్టిన మహాధర్నా నిరసనని అపేందుకు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్, నిత్యానంద రాయ్ చంఢీగడ్ తరలివెళ్లారు. అక్కడ రైతు నేతలతో పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని సమాచారం.


మూడేళ్ల క్రితం వ్యవసాయం చట్టాలను వ్యతిరేకిస్తూ.. పంజాబ్ రైతులు నెలల తరబరి చేసిన ధర్నా వల్ల మోదీ ప్రభుత్వం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికల దృష్ట్యా మరోసారి అలాంటి ధర్నా జరగకుండా ఉండేందుకు బీజేపీ మంత్రులు.. రైతుల వద్దకు చర్చలు జరిపేందుకు పరుగులు తీశారు.

కనీస మద్దతు ధర కోసం ప్రత్యేక చట్టం, పంట బీమా, రైతు బీమాలు ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లు కోసం ఢిల్లీ సరిహద్దులలో రైతులు ఫిబ్రవరి 13న రైతు ట్రాక్టర్ మార్చ్ నిరసన భారీ స్థాయిలో చేపట్టనున్నారు.


అలాగే 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ధర్నాలో రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ-నోయిడా సరిహద్దులో రెండు రోజులుగా ఉత్తర ప్రదేశ్ రైతుల నిరసన జరుగుతోంది. ప్రభుత్వం తీసుకున్న తమ భూములకు బదులుగా పరిహారం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×