EPAPER

Mood Of the Nation 2024: తెలంగాణలో కాంగ్రెస్ వాహ.. ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే జోరు..

Mood Of the Nation 2024: తెలంగాణలో కాంగ్రెస్ వాహ.. ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే జోరు..
Mood Of the Nation

India Today Mood of the Nation 2024: పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం సాధిస్తుంది? తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇండియా టుడే – సీఓటర్ కలిసి సర్వే చేశాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేని ఆదరణ ఉందని అందులో స్పష్టమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో టి-కాంగ్రెస్‌ 10 సీట్లు సాధిస్తుందని సర్వే రిపోర్టులో తేలింది. గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్, ఈసారి మూడు సీట్లతో సరిపెట్టుకోనుంది. 4 సిట్టింగ్ స్థానాలున్న బీజేపీ.. ఒక సీటు కోల్పోనుంది. హైద్రాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే – సీఓటర్ సర్వే స్పష్టంచేస్తోంది.


పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపరని ఓ సర్వేలో తేలింది. ఇండియాటుడే- సీ ఓటర్ కలిసి చేసిన సర్వేలో టీడీపీ-జనసేన, వైసీపీలకే అన్ని స్థానాలు సొంతం కానున్నాయి. టీడీపీ-జనసేన కలిసి 17 సీట్లు కైవసం చేసుకోనున్నాయి. వైసీపీ 8 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో తేలింది.

ఓట్ షేరింగ్ విషయానికి వస్తే.. తెలుగుదేశం పార్టీ 45 శాతం ఓట్లు పొందనుంది. వైసీపీకి 41 శాతం ఓట్లు పడతాయని స్పష్టమైంది. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదని ఇండియాటుడే – సీ ఓటర్ సర్వే తేల్చింది. కాంగ్రెస్‌కు 2.7 శాతం ఓట్లు పడతాయని, బీజేపీ 2.1 శాతం ఓట్ షేర్ పొందుతుందని స్పష్టంచేసింది.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×