EPAPER

Moto G24 Power Sale: మోటో జీ24 పవర్ సేల్.. రూ.10 వేలలోపే 128 జీబీ స్టోరేజ్ ఫోన్!

Moto G24 Power Sale: మోటో జీ24 పవర్ సేల్.. రూ.10 వేలలోపే 128 జీబీ స్టోరేజ్ ఫోన్!
Moto G24 Power Sale

Moto G24 Power Sale:


టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లతో స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఫోన్ ప్రియులు కూడా కొత్త మొబైళ్లపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల వారిని దృష్టిలో పెట్టుకొని.. ప్రముఖ మొబైల్ కంపెనీలు కూడా అధునాతన టెక్నాలజీతో పలు మోడళ్లను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నా కొనేందుకు వెనక్కి తగడం లేదు. మరికొందరేమో వారి స్థోమతకు తగ్గట్టుగా.. మంచి ఫీచర్లతో కూడిన మొబైళ్లను కొనుక్కుంటున్నారు.

ఇక అందరికీ అందుబాటు ధరలోకి మరో మొబైల్ వచ్చింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటో రీసెంట్‌గా ‘మోటో జీ24 పవర్’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ సేల్ తాజాగా ప్రారంభమైంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, మోటొరోలా అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుక్కోవచ్చు.


READ MORE: Redmi 12 5G offer: 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఎగబడి కొనేస్తున్న కస్టమర్లు..!

ధర:

మోటొ జి24 పవర్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. గ్లేసియర్ బ్లూ, ఇంక్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్‌ను సొంతం చేసుకోవచ్చు.

స్పెసిఫికేషన్స్, ఫీచర్లు:

మోటొ జి24 పవర్ మొబైల్‌లో 6.56 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అమర్చారు. అలాగే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హర్ట్జ్ కాగా.. పీక్ బ్రైట్‌నెస్ 537 నిట్స్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. అదనంగా 16 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. కాగా 3డీ ఏక్రిలిక్ గ్లాస్ బిల్డ్‌ను ఈ ఫోన్ కలిగి ఉండటం విశేషం.

ఈ ఫోన్ వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉంది. వీటితో పాటు 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్‌ను అమర్చారు. అంతేకాకుండా సెల్ఫీల కోసం ముందుభాగంలో 16 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇందులో 128 జీబీ వరకు స్టోరేజ్ ఉండగా.. దాన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా దాదాపు 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

READ MORE: Valentine Day Offers in Amazon: వాలెంటైన్ డే ఆఫర్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్..!!

ఐపీ 53 రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ బిల్డ్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అమర్చారు. డాల్బీ అట్మాస్‌ను పోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కాగా ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×