EPAPER

Telangana Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. బీఏసీ కీలక నిర్ణయం..

Telangana Budget Session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. బీఏసీ కీలక నిర్ణయం..

Telangana Budget Session 2024 MAC Meeting: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈనెల 13 వరకు జరగనున్నాయి. బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 13 వరకు అసెంబ్లీ సెషన్ కొనసాగనుంది. శుక్రవారం గవర్నర్ ప్రసంగంపై సభలో ధన్యవాద తీర్మానం ఉంటుంది. ఈ నెల 10న డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. 12న బడ్జెట్‌లోని అంశాలపై చర్చ నిర్వహిస్తారు. మరుసటిరోజు అనగా ఫిబ్రవరి 13న బడ్జెట్‌ను ఆమోదిస్తారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి.


బీఆర్ఎస్‌ నుంచి బీఏసీ మీటింగ్‌కు హరీశ్‌రావు, కడియం శ్రీహరి హాజరయ్యారు. ముందుగా కేసీఆర్‌, కడియం హాజరవుతారని బీఆర్ఎస్ పేర్లు ఇచ్చిం. అయితే కేసీఆర్‌ ప్లేస్‌లో హారీశ్ రావు వచ్చారు. పేర్లు ఉన్నవారు మాత్రమే రావాలని మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు. దీంతో 10 నిమిషాల తర్వాత బీఎసీ నుంచి హరీశ్‌రావు బయటకు వెళ్లిపోయారు.

ఈ వ్యవహారంపై హరీశ్ రావు స్పందించారు. గతంలో లేని సంప్రదాయాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువస్తోందని విమర్శించారు. కడియం శ్రీహరితోపాటు హరీశ్‌రావు బీఏసీకి వస్తారని బుధవారమే స్పీకర్‌కు బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌ కేసిఆర్ తెలియజేశారన్నారు. స్పీకర్ రమ్మన్నారు కాబట్టే వెళ్లనన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న సీపీఐను బీఏసీ సమావేశానికి పిలిచారని తెలిపారు.


హరీశ్ రావు వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఎవరినీ వ్యక్తిగతంగా బీఏసీ నుంచి బయటికి వెళ్లమని కోరలేదన్నారు. స్పీకర్‌ నిర్ణయం మేరకే బీఏసీ నడిచిందన్నారు. పార్టీల నుంచి ముందుగా ప్రతిపాదించిన సభ్యులే బీఏసీకి రావాలని స్పీకర్‌ కోరారన్నారు.

అటు తెలంగాణ శాసన మండలి బీఏసీ కూడా సమావేశమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన మీటింగ్‌లో డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Related News

Khammam Floods: మరోసారి డేంజర్ బెల్స్..అప్రమత్తమైన ప్రభుత్వం

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

Big Stories

×