EPAPER

Pro Iran Commander Death: అమెరికా దాడి.. ఇరాన్‌ మద్దతున్న కీలక కమాండర్‌ మృతి

Pro Iran Commander Death: అమెరికా దాడి.. ఇరాన్‌ మద్దతున్న కీలక కమాండర్‌ మృతి

USA Says It Killed Pro Iran Commander: ఇరాక్‌ (Iraq) లోని మిలిటెంట్ల స్థావరాలపై ఫిబ్రవరి 7న జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్‌‌కు మద్దతున్న ఓ కీలక కమాండర్‌ చంపబడినట్లు అమెరికా (USA) సైన్యం ప్రకటించింది. మద్యప్రాచ్యం (Middle East) లోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతడి హస్తం ఉందని తెలిపింది.


జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికులు మరణించినందుకు ప్రతీకారంగానే తాము ఈ దాడికి పాల్పడ్డామని వివరించింది. ఇరాన్ మద్దతుగల కతేబ్ హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్, ఇతర సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా పేర్కొంది. అందులో భాగంగానే ఇటీవల జోర్డాన్‌లో దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేసింది.

వాటిపై స్పందిస్తూ.. ఇరాక్, సిరియాల్లో ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న మిలిటెంట్ గ్రూపులపై దాడులు చేస్తున్నామని వివరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 7న కతేబ్‌ హెజ్‌బొల్లాకు చెందిన కీలక కమాండర్‌ అబూ బకర్‌ అల్‌-సాదిని మట్టుబెట్టామని తెలిపింది. ఈ విషయాన్ని ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు ఆ సంస్థ ధృవీకరించింది.


స్వయం ప్రకటిత పారామిలిటరీ గ్రూపుల సంకీర్ణమైన హషెడ్ అల్-షాబీ అమెరికా చర్యలను ఖండించింది. శుక్రవారం జరిగిన దాడిలో తమ యోధుల్లో 16 మంది మరణించారని అగ్రరాజ్యం వెల్లడించారు. మరో 36 మంది గాయపడ్డారని చెప్పారు.

హషీద్ అల్-షాబీని లక్ష్యంగా చేసుకుంటే ఎదురుకాల్పులు తప్పవని ఆ గ్రూప్ నాయకుడు ఫలేహ్ అల్-ఫయాద్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా (USA) దళాలు సిరియాలో జరిపిన దాడుల్లో ఇరాన్‌కు మద్దతుగా పోరాడుతున్న 29 మంది మరణించారని మానవహక్కుల సంస్థ తెలిపింది.

ఇరాక్‌లోని అమెరికా (USA) బలగాల ఉపసంహరణపై జనవరి నుంచే చర్చలు మొదలయ్యాయని సమాచారం. ఇరాక్ ప్రధాని ఖచ్చితమైన గడువును తెలియజేయాలని కొరుతున్నారు. ఉగ్రసంస్థ ఐసిస్‌పై పోరులో భాగంగా ప్రస్తుతం ఇరాక్‌లో 2,500, సిరియాలో 900 మంది సైనికులను అమెరికా మోహరించింది.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×