EPAPER

TSDCA Bust in Hyderabad: యాంటీ క్యాన్సర్ డ్రగ్స్.. పర్మిషన్ లేకుండా తయారీ.. గుట్టు రట్టు!

TSDCA Bust in Hyderabad: యాంటీ క్యాన్సర్ డ్రగ్స్.. పర్మిషన్ లేకుండా తయారీ.. గుట్టు రట్టు!
TSDCA Bust

TSDCA Bust Illegal Anti-Cancer Drug Production in Telangana: తెలంగాణ స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TSDCA) చర్లపల్లిలోని ఇండియన్ జెనోమిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీనలో యాంటీ క్యాన్సర్ ఔషధాల అక్రమ తయారీ గుట్టు రట్టు చేసింది. ఎటువంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా.. చట్టవిరుద్ధంగా క్యాన్సర్ నిరోధక ఔషధం ‘సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్’ను తయారు చేస్తుందన్న పక్కా సమాచారంతో TSDCA రైడ్స్ నిర్వహించి అక్రమ తయారీని అడ్డుకుంది. క్యాన్సర్ రోగుల జీవితాలను ఈ సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్ ప్రమాదంలో పడేస్తుంది.


“ఇండియన్ జెనోమిక్ ప్రైవేట్ లిమిటెడ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లతో పాటు సైటోటాక్సిక్ యాంటీ క్యాన్సర్ మందులను తయారు చేస్తోంది. తద్వారా ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఉంది. సైటోటాక్సిక్ యాంటీ-క్యాన్సర్ డ్రగ్ ‘సైక్లోఫాస్ఫమైడ్ ఇంజెక్షన్’ క్యాన్సర్ రోగులలో కీమోథెరపీ కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే కణాల జన్యు పదార్థాన్ని (DNA మరియు RNA) దెబ్బతీస్తుంది, తద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపుతుంది.

ఇటువంటి మందులు తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతాయి. వీటి తయారీకీ ప్రత్యేక మార్గదర్శకాలు, స్వీయ-నియంత్రణ ఉత్పత్తి సౌకర్యాలు కావాలి. ఇతర సాధారణ ఔషధాల తయారీకి, సైటోటాక్సిక్ పదార్ధాల తయారీకి వ్యత్యాసం.’సైటోటాక్సిక్ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్’తో కూడిన సాధారణ ఔషధాల తయారీ క్రాస్-కాలుష్యానికి దారితీస్తుంది. ఇవి రోగుల ఆరోగ్యంపై తీవ్ర పరణామాలు చూపిస్తాయి” అని TSDCA డైరెక్టర్ జనరల్, VB కమలసన్ రెడ్డి బుధవారం వెల్లడించారు.


మంగళ, బుధవారాల్లో ఇండియన్‌ జెమోయిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆవరణలో DCA బృందం దాడులు చేసి కీమోథెరపీ డ్రగ్‌ నిల్వలను స్వాధీనం చేసుకుంది. ఫార్మా కంపెనీ తయారీ కేంద్రంలో క్యాన్సర్ నిరోధక ఔషధాన్ని తయారు చేయడానికి లైసెన్స్‌ లేదు. అలాగే సైటోటాక్సిక్ యాంటీ-క్యాన్సర్ ఔషధాలను తయారు చేయడానికి కావాల్సిన ప్రత్యేక సదుపాయం కూడా లేదు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, ఇతర సాధారణ ఔషధాలను తయారు చేయడానికి మాత్రమే ఈ సంస్థ లైసెన్స్‌లను కలిగి ఉంది.

కంపెనీ ప్రొడక్షన్ కేంద్రంలో యాంటీకాన్సర్ డ్రగ్ సైక్లోఫాస్ఫమైడ్ API కలిగిన మూడు అల్యూమినియం డబ్బాలను DCA అధికారులు గుర్తించారు. BO-కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, బోయిసర్, పాల్ఘర్, మహారాష్ట్ర ఈ మూడు API డబ్బాలను తయారు చేసినట్లు లేబుల్ చేసి ఉన్నట్లు గుర్తించారు.

యాంటీకాన్సర్ API డబ్బాలను SP అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసినట్లు ఇండియన్ జెనోమిక్స్ ప్రై.లి. డైరెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

కాగా DCA అధికారులు సైక్లోఫాస్ఫామైడ్ నిల్వలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తదుపరి విచారణ చేపట్టి నేరస్తులందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని DCA అధికారులు తెలిపారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×