EPAPER

Asaduddin Owaisi: యూసీసీ ఒక హిందూ కోడ్.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..

Asaduddin Owaisi: యూసీసీ ఒక హిందూ కోడ్.. ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు..
Asaduddin Owaisi's speech on UCC

Asaduddin Owaisi’s speech on UCC(Telugu breaking news): ఉత్తరాఖండ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్ ( యూసీసీ)ని పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అద్యక్షుడు, ఎంపీ అసదుద్దీన ఒవైసీ అభివర్ణించారు. ఢిల్లీలో ఆయన యూసీసీపై స్పందిస్తూ హిందువుల కోడ్ అయిన ఉమ్మడి పౌరసత్వాన్ని ముస్లింలపై, ఇతర మతాల వాళ్లపై వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్‌లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్‌)ను ఎందుకు ముట్టుకోలేదని ఆయన ప్రశ్నించారు.


ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్‌ సింగ్‌ యూసీసీ బిల్లు అసెం‍బ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అసదుద్దీన్ విమర్శలు గుప్పించారు. వరదలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్‌ సింగ్‌కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని ఓవైసీ డిమాండ్‌ చేశారు.


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×