EPAPER

Garlic Price Hike : బాబోయ్.. ఎల్లిగడ్డ

Garlic Price Hike : బాబోయ్.. ఎల్లిగడ్డ
Garlic price today

Garlic price today (today’s latest news):


వెజిటేరియన్ వంటకమైనా.. నాన్ వెజిటేరియన్ డిష్ అయినా ఎల్లిగడ్డ(వెల్లుల్లి) ఉండి తీరాల్సిందే. ఆహారానికి రుచిని చేర్చే కీలకమైన ఆ దినుసు పేరు వింటేనే ఇప్పుడు అందరూ హడలిపోతున్నారు. గత వారంరోజులుగా నింగినంటిన ధరలతో బెంబేలెత్తుతున్నారు. ఫస్ట్ గ్రేడ్ వెల్లుల్లి హోల్ సేల్ ధర కిలో రూ.400 దాటేసింది. ఇక రిటైల్ మార్కెట్ విషయానికి వస్తే.. రూ.500కి పైనే పలుకుతోంది.

సెకండ్ గ్రేడ్ ఎల్లిగడ్డ టోకు ధర రూ.380 వరకు ఉండగా.. చిల్లర ధర కిలో రూ.450 వరకు ఉంది. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ అటూ ఇటుగా ఎల్లిగడ్డ ధర ఇలాగే మంటెక్కిస్తోంది. గత పదేళ్లలో ఎల్లిగడ్డ ధరలు ఇంతలా ఎగసిపడటం ఇదే తొలిసారి అని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి.


2013లో కిలో ధర రూ.300కు చేరింది. అనంతరం చైనా నుంచి భారీ సైజు వెల్లుల్లి భారత మార్కెట్లను ముంచెత్తింది. దాంతో ధరలు గణనీయంగా పడిపోయాయి.
నెలరోజుల క్రితం కూడా గార్లిక్ ధర రూ.180-250 మధ్యే ఉంది. ఖరీఫ్(వేసవి), రబీ(శీతాకాలం) రెండు సీజన్లలోనూ ఎల్లిగడ్డ పంట సాగవుతుంది. సరైన వర్షాలు లేని
కారణంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో కొన్ని ప్రాంతాల్లో జూలైలోవిత్తిన వేసవి పంట దెబ్బతింది.

దేశంలో పండే ఎల్లిగడ్డలో 40% వాటా మహారాష్ట్ర నుంచే అందుతోంది. ప్రస్తుతం డిమాండ్ తగ్గట్టుగా సరుకు అందుబాటులో లేదు. గుజరాత్ నుంచి అందిన
ఎల్లిగడ్డ స్టాక్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. మధ్యప్రదేశ్ సరుకు
మాత్రమే ప్రస్తుతం మార్కెట్‌లో ఉందని ఓ ట్రేడర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఎల్లిగడ్డ కొరత తీవ్రంగా ఉందని వివరించారు. వాస్తవానికి ఈ స్పైస్‌కు ప్రపంచమంతటా కొరత
కనిపిస్తోంది. ఎల్లిగడ్డను అత్యధికంగా పండించే చైనా నుంచి కూడా సరఫరా గణనీయంగా తగ్గింది. అంతిమంగా ఇది ధరల పెరుగుదలకు దారి తీసింది.

పై పెచ్చు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎల్లిగడ్డకు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా అవసరాలు తీరాలంటే లక్ష బ్యాగుల వెల్లుల్లి అవసరం. ఆ మేర ప్రస్తుతం స్టాక్ లేదు. అటు కొరత, ఇటు డిమాండ్ కారణంగా వెల్లుల్లి ధరలు
ఆకాశాన్ని అంటాయని వర్తకులు వాపోతున్నారు. మరో నెలరోజుల్లో కొత్త పంట చేతికి అందే వరకు ధరలు ఇలాగే భగ్గుమంటాయని చెబుతున్నారు. అప్పటి వరకు మన అవసరాలను కుదించుకుని సర్దుకుపోవాల్సిందే.

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×