EPAPER

Kumari Aunty : నెట్‌ఫ్లిక్స్‌లోకి కుమారి ఆంటీ లైఫ్ స్టోరీ.. డాక్యుమెంటరీకి అంతా సిద్ధం..!

Kumari Aunty : నెట్‌ఫ్లిక్స్‌లోకి కుమారి ఆంటీ లైఫ్ స్టోరీ.. డాక్యుమెంటరీకి అంతా సిద్ధం..!

Kumari Aunty Life Story on Netflix: సోషల్ మీడియా పుణ్యమా అంటూ చాలామంది వైరల్ అవుతూనే ఉన్నారు. ఒకరు ఒక డైలాగ్‌తో మరొకరు బిహేవియర్‌తో వైరల్ అవుతుంటారు. ఇంకొందరైతే వాళ్ల యాసబట్టి భాష, అలాగే.. వారు చేసే వృత్తి బట్టి కూడా వైరల్ అవుతుంటారు.


అనుకోకుండా అలా సెలబ్రిటీలు అయినవారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. అయితే ఈ మధ్య ఈ వ్యవహారం పీక్స్‌కు చేరింది. ఏదైనా ఒక వీడియో వైరల్ అయితే చాలు అందులో ఉండేవారు సెలబ్రెటీల కన్నా ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.

అయితే అలాంటిదే ఈ మధ్య ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. అంతేకాదు.. ఆ వీడియో ద్వారా ఆమె సెలబ్రెటీల కంటే కూడా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. కుమారి ఆంటీ. ఈమె గురించి ప్రస్తుతం జనాలకు చెప్పల్సిన పనేలేదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్‌గా ఉండేవాళ్లకి ఈమె తెలియకుండా అసలు ఉండదు. గత కొద్దిరోజులుగా ఈ ఆంటీ పాపులారిటి ఆకాశాన్ని తాకుతోంది.


ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడకి చెందిన కుమారి ఆంటీ.. హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గంచెరువు దగ్గర ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకుంది. గుమగుమ లాడించే టేస్టీ, రకరకాల వంటకాలతో కస్టమర్లను ఆకర్షించి సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ రన్ చేసుకుంటోంది.

READ MORE: Kumari Aunty : కుమారి ఆంటీ క్రేజే వేరు.. నెలకు రూ. 18 లక్షలు..!

అయితే ఒక చిన్న వీడియోతో ఈమె ఫుల్ పాపులర్ అయిపోయింది. ఆ వీడియోలో ‘బిల్ ఎంతయిందమ్మా అని ఆమెను అడగగానే.. మీది మొత్తం థౌసండ్ రుపీస్ అయింది.. 2 లివర్స్ ఎక్స్ట్రా’ అని చెప్తాది. దీంతో ఆమె చెప్పిన ఈ పదం ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో డైలాగ్‌గా క్రియేట్ అయి.. తెగ పాపులర్ అయిపోయింది. అక్కడి నుంచి ఈ ఆంటీ ఫుడ్‌ను టేస్ట్ చేయడానికి జనాలు పరుగులు తీశారు.

ఆంటీ షాప్ దగ్గర విపరీతమైన జనంతో ఫుల్ ట్రాఫిక్ ఏర్పడింది. పోలీసులు సైతం ఈమె ఫుడ్ స్టాల్ కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని.. యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఆ షాప్‌ని తీసివేయాలని కూడా చెప్పారు.

అయితే అక్కడ నుంచి అసలు స్టోరీ షురూ అయింది. ఆమె బిజినెస్‌లో ఎదగడం చూసి కొందరు ఓర్వలేక ఆమె ఫుడ్ స్టాల్ తీసేయాలని చూస్తున్నారని వార్తలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమెకు ప్రతి ఒక్కరూ సపోర్ట్‌గా నిలిచారు.

విశేషమేంటంటే.. సోషల్ మీడియా ఆడియాన్సే కాకుండా సెలబ్రెటీలు కూడా ఆమెకు సపోర్ట్‌గా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం కుమారి ఆంటీకి సపోర్ట్ చేయడం గమనార్హం.

ఈ మేరకు ఆమెకు అండగా ఉంటానని తెలిపారు. అంతేకాకుండా ఆమె అక్కడే షాప్ నడుపుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఆమెను కలుస్తానని కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఆమె పేరు ఇంకా మారుమోగిపోయింది.

READ MORE: Kumari Aunty : కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పై సీఎం రేవంత్ స్పందన.. “త్వరలోనే స్టాల్ సందర్శిస్తా”..

ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఎలాంటి లైఫ్‌ను లీడ్ చేస్తుంది. ఆమె ఎంత సంపాదిస్తుంది అనే విషయాల్ని అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా కొన్ని యూట్యూబ్‌ ఛానల్స్ ఆమెపై కొన్ని ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నారు.

అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్ కూడా కుమారి ఆంటీ జీవిత కథ ఆధారంగా మూడు ఎపిసోడ్స్‌‌తో డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశముందని సమాచారం.

Related News

Telugu Tamil language issue : తెలుగు తెరపై తమిళ భాషోన్మాదం

Ram Lakshman: మానవత్వం చాటుకున్న ఫైట్ మాస్టర్స్.. !!

Game Changer : ‘గేమ్ ఛేంజర్’ లో ఆ స్పెషల్ సాంగ్ కి అన్నికోట్లా ?

Rajinikanth : ఆ రెండు కథలు పూర్తిగా నాకెందుకు చెప్పలేదు

Trivikram Srinivas : గురూజీకి కథ చెప్పడం అంత తేలికా.?

Salman Khan : లారెన్స్ బిష్ణోయ్ కి సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఓపెన్ ఆఫర్

Karthik Subbaraj : ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ తీస్తున్నాడు, ఎలా వస్తుందో ఏంటో.?

Big Stories

×