EPAPER

Rose Day : హ్యపీ రోజ్ డే ప్రియా.. వివిధ రంగుల రోజాలకు అర్థం ఇదే..!

Rose Day : హ్యపీ రోజ్ డే ప్రియా.. వివిధ రంగుల రోజాలకు అర్థం ఇదే..!

Rose Day : ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. ప్రేమ పండుగకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అయితే వాలెంటైన్స్ డే సందడి వారం రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వాలెంటైన్ వీక్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ వీక్‌ను రొమాంటిక్ వీక్‌గా చెప్పుకుంటారు. వాలెంటైన్ వీక్‌ ఫిబ్రవరి 7 రోజ్‌డేతో మొదలువుతుంది. ఈ రోజు నుంచి 14 వరకు ప్రతి రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.


ఫిబ్రవరిలో వసంతకాలం ప్రారంభమవుతుంది. దీంతో రోజా పువ్వులు విరబూస్తాయి. తమ ప్రియమైన వారికి రంగురంగుల గులాబీలు బహుమతులుగా అందజేస్తారు. ఒక్కో గులాబీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రోజ్‌డే రోజున మీ ప్రియమైన వారికి గులాబీ ఇచ్చే ముందు ఏ రంగు గులాబీకి ఎలాంటి అర్థం ఉంటుందో తెలుసుకోండి..!

ఎర్ర గులాబీ


గులాబీలలో ఎర్ర గులాబీ అత్యంత ప్రియమైనది. రోమ్ పురాణాల ప్రకారం ఎర్ర గులాబీని ప్రేమకు చిహ్నంగా పిలుస్తారు. ఎర్ర గులాబీ కథ ప్రేమ దేవతగా పరిగణించబడే గ్రీకు దేవత ఆఫ్రొడైట్‌కి సంబంధించినది. ఒకసారి ఆఫ్రొడైట్ ప్రేమికుడు అడోనిస్ గాయపడినప్పుడు.. ఆమె తెల్లటి గులాబీ ముళ్లపై నుంచి అతని వద్దకు పరిగెత్తింది. అప్పుడు ఆమె పాదాలు గులాబీ ముళ్లు గుచ్చుకొని ఎర్రగా మారాయి. ఈ కారణంగా ఎర్రటి గులాబీ అంతులేని ప్రేమకు చిహ్నంగా మారింది. మీరు ఈ ప్రేమికుల వారంలో ఎర్ర గులాబీని ఎవరికైనా ఇస్తున్నారంటే వారిని ప్రేమిస్తున్నారని చెప్పడమే.

ఆరెంజ్ గులాబీ

మీరు ఎవరినైనా చాలా ఎక్కువగా ఇష్టపడుతుంటే.. వారికి ఆరెంజ్ గులాబీని ఇవ్వండి. మీ ఇష్టాన్ని తెలిపేందుకు ఆరెంజ్ గులాబీ ఇవ్వడం మంచి మార్గం. అంతే కాకుండా మీ మనసులో మాటను బయటపెట్టండి. ఇద్దరి ఇష్టాలు ఒకరికొకరు పంచుకోండి.

పీచు గులాబీ

మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే మీ మనసులో మాట చెప్పటానికి భయం లేదా సిగ్గుపడుతుంటే వారికి పీచు గులాబీ ఇవ్వండి. ఈ గులాబీ ద్వారా మీ మనసులో మాటను సులభంగా చెప్పవచ్చు. ఈ పీచు గులాబీ ఇస్తే.. ప్రేమిస్తున్నారని అర్థం.

పసుపు గులాబీ

పసుపు రంగు గులాబీ అనేది ఇద్దరి మధ్య స్నేహాన్ని సూచిస్తుంది. వారిపై మీకు ఇష్టం, అభిమానం, ఆ స్నేహం మీతో ఇలానే కలకాలం నిలిచి ఉండాలంటే పసుపు రంగు గులాబీ ఇవ్వడం సరైనది.

లావెండర్ గులాబీ

లావెండర్ గులాబీ అనేది చాలా అరుదైనది. ఈ రంగు గులాబీ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఎవరితో అయినా మొదటి చూపులో ప్రేమలో పడితే లావెండర్ గులాబీని బహుమతిగా ఇవ్వండి. అంతేకాకుంగా వారి ఆకర్షించే రూపాన్ని, అందాన్ని పొగడటానికి ఈ గులాబీ ఇస్తే సరిపోతుంది.

పింక్ గులాబీ

పింక్ రంగు గులాబీ అనేది అభిమానికి గుర్తింపుగా చెప్పాలి. ఎవరినైనా అభినందించాలన్న లేదా మెచ్చుకోవాలన్న పింగ్ గులాబీ ఇవ్వండి.

తెల్ల గులాబీ

తెల్ల గులాబీని ప్రత్యేక సందర్భాల్లో ఇచ్చుకుంటారు. శుభాకాంక్షలు చెప్పడానికి, ఎవరైన దూరం అయితే నివాళిగా తెల్ల గులాబీ ఇవ్వడం సరైనది.
ప్రేమికులు ఈ తెల్ల గులాబీలు సాధారణంగా ఇచ్చిపుచ్చుకోరు.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×