EPAPER

AP Assembly Sessions 2024 : శాసనసభలో నిరసన.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

AP Assembly Sessions 2024 : శాసనసభలో నిరసన.. టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

AP Assembly Sessions 2024 : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. శాసన సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ విపక్ష ఎమ్మెల్యేలు సభలో నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపి వారి నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు.


టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళనలపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనలు విరమించాలని కోరారు. అయినా సరే టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు కొనసాగించారు. దీంతో ఒకరోజుపాటు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.

కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్‌, ఆదిరెడ్డి భవాని, ఏలూరి సాంబశివరావు, గణబాబు, గొట్టిపాటి రవికుమార్‌, డోలా బాలవీరాంజనేయ స్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్‌ ఒకరోజు సభ నుంచి సస్పెండ్ అయ్యారు.


Tags

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×