EPAPER

Hairy Ears : చెవిపై వెంట్రుకలు.. ఏం జరుగుతుందో తెలుసా..!

Hairy Ears : చెవిపై వెంట్రుకలు.. ఏం జరుగుతుందో తెలుసా..!

Hairy Ears : వయసుతో పాటు పురుషులకు గుండెలు, చెవులపై వెంట్రుకలు రావడం సాధారణం. వాస్తవానికి మన శరీరంలో అరచేతులు, అరికాళ్లు, పెదవులు తప్పా .. మిగతా శరీర భాగాలపై వెంట్రుకలు ఉంటాయి. ఇందులో భాగంగానే మనలో చెవిలో వెంట్రుకలు వస్తాయి. అయితే కొందరు దీన్ని ఏదో ఆరోగ్య సమస్యగా భావిస్తారు.


మన శరీర నిర్మాణంలో ఇటువంటి లక్షణం ఉండటం సహజం. కానీ ఇది మనకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో చాలా మందికి తెలియదు. కొందరేమో చెవిలో వెంట్రుకలను తీసేస్తారు. మరికొందరు అలానే చెవిలో ఉంచేస్తారు. కానీ చెవిలోని వెంట్రుకలను తీయడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ చెవి భాగంలో వెంట్రుకల గురించి వైద్య నిపుణుల ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

చెవులో వెంట్రుకలు కొందరికి నిక్కపొడుచుకుని ఉంటాయి. వీటిని కొందరు వింతగా చూస్తుంటారు. అయితే ఈ వెంట్రుకలను ఎవరూ అడ్డుకోలేరు. ఎందుకంటే ఇది జన్యుపరమైన అంశమని నిపుణులు చెబుతున్నారు. పురుషులలో పెరిగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రభావం కారణంగా కూడా ఇలా జరగొచ్చని భావిస్తున్నారు. ఈ హార్మోన్ చెవిలోని జుట్టును ముతకగా, మందంగా చేస్తుంది.


చెవులపై ఉండే వెంట్రుకలను వింతగా చూడటం సహజమే. కానీ చెవిలో వెంట్రుకలు ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలగవు. చెవిలో వెంట్రుకలు ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెవి లోపల ఉండే వెంట్రుకలు చెవిపోటు నుంచి రక్షిస్తాయి. అలానే చెవిని దుమ్మూ,ధూళి నుంచి కాపడాటానికి ఐయర్ వాక్స్‌తో కలిసి పని చేస్తుంది.

భారత్, శ్రీలంక దేశాల్లోని పురుషుల్లో చెవులపై ఎక్కువగా వెంట్రుకలు రావడాన్ని చూడొచ్చు. దీనికి కారణం హైపర్ట్రిసిస్ అనే ఒక పరిస్థితి అని నిపుణులు అంటున్నారు. దీనివల్ల శరీరమంతా జుట్టు పెరుగుతుంది. చెవులపై వెంట్రులకు నచ్చని వారు వాటిని తొలగించొచ్చు. దీనివల్ల ఎటువంటి సమస్య ఉండదు. చెవిలో వెంట్రుకలు తొలిగించడానికి అనేక రకాల క్రీములు, ట్రీట్మెంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×