EPAPER

Shaking Legs : కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా..?

Shaking Legs : కూర్చున్నప్పుడు కాళ్లు ఊపుతున్నారా..?

Shaking Legs : మనలో చాలా మందికి కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. సీట్లో కూర్చున్న సమయంలో మన ప్రమేయం లేకుండానే కాళ్లు ఊగిపోతుంటాయి. ఫ్రెండ్స్‌‌తో మాట్లాడుతున్న, పుస్తకాలు చదువుతున్నా కాళ్లు ఊపడం మాత్రం ఆపరు. మీకు తెలుసా ఇలా చేయడం సరదాగా ఉన్నప్పటికీ.. కాళ్లు ఊపడం మంచిది కాదు. ఈ అలవాటును రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని అంటారు. దీనికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.


ఒక వ్యక్తి ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో కంట్రోల్ తప్పుతుంది. దీని వల్ల మనకు తెలియకుండానే కాళ్లు అనవసరంగా కదులుతూ ఉంటాయి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉంటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

అలానే సరైన నిద్ర లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత కూడా కాళ్లు ఊపడానికి కారణంగా చెప్పవచ్చు. నిద్ర సమస్యతో బాధపడే వారు కాళ్లను ఎక్కువగా ఊపుతుంటారు. ఈ అలవాటును మార్చుకోవడానికి ఐరన్ టాబ్లెట్లు సాయపడతాయి. వీటితో పాటు అరటి పండ్లు, బీట్‌రూట్ తీసుకుంటే మంచిది.


కాళ్లు ఊపే అలవాటు ఉన్న వారు కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వీలైనంత మొబైల్ వాడటం తగ్గించాలి. టీవీ చూసే అలవాటు ఉంటే దాన్ని కూడా మానేయండి. ఏదైనా ఒక టైమ్ పెట్టుకుని చూడండి.

అతిగా మద్యం తీసుకున్నప్పుడు శరీరం తేలికగా మారుతుంది. దీనివల్ల మెదడులో డోపమైన స్థాయిలు పెరగడం ప్రారంభమవుతాయి. ఈ కారణంగా కాళ్లలో వణుకు వస్తుంది.

కాళ్లు ఊపడానికి రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ కూడా కావచ్చు. ఈ రెస్ట్‌లెస్ సిండ్రోమ్ కారణంగా పాదాలకు తిమ్మిరి అనుభూతి కలుగుతుంది. ఈ సమస్య తీవ్రమైతే నడవడం కష్టంగా మారుతుంది.

అనవసరంగా కాళ్లు కదిలించడం వెనుక జన్యుపరమైన కారణాలు కూడా ఉండొచ్చు. దీన్ని ఎసెన్షియల్ ట్రెమర్ అని కూడా అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రభావితమైన అవయవాలను కదిలించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

ఈ అలవాటు బారిన పడిన వారు.. కూర్చున్నారంటే అప్రయత్నంగా వారి కాళ్లు ఊగడం చేస్తుంటాయి. ఎవరు ఎన్ని చెప్పినా అలాగే ఊపుతుంటారు. ఈ అలవాటును మార్చుకుని ఆరోగ్యంగా జీవించండి.

Tags

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×