EPAPER

Ind Vs Eng 2nd Test Highlights: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. రెండో టెస్టులో భారత్ ఘనవిజయం

Ind Vs Eng 2nd Test Highlights: చెలరేగిన బుమ్రా, అశ్విన్.. రెండో టెస్టులో భారత్ ఘనవిజయం
Ind Vs Eng 2nd Test

India Vs England 2nd Test Highlights:


విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 292 పరుగులకు ఆలౌట్ అయ్యంది. 106 పరుగులతో పరుగుల తేడాతో భారత్ విజయభేరి మోగించింది.

ఓవర్ నైట్ స్కోర్ 67/1తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ తొలుత నైట్ వాచ్ మన్ రెహాన్ అహ్మద్ వికెట్ కోల్పోయింది. ఆ జట్టు స్కోర్ 95 పరుగుల వద్ద రెహాన్ అహ్మద్ (23) ను అక్షర్ పటేల్ ఎల్బీ చేసి పెవిలియన్ కు చేర్చాడు. తొలి టెస్టు హీరో ఓలీ పోప్ ( 23 ) ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు. స్టార్ బ్యాటర్ జో రూట్ (16) కూడా ఎక్కువగా సేపు క్రీజులో నిలబడలేదు. రూట్ కూడా అశ్విన్ స్పిన్ వలకు చిక్కాడు.


తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో రాణించిన జాక్ క్రాలీ రెండో ఇన్నింగ్స్ లోనూ ఒంటరి పోరాటం చేశాడు. 73 పరుగుల చేసి క్రాలీని కులదీప్ ఎల్బీ చేసి పెవిలియన్‌కు పంపాడు. వెంటనే జానీ బెయిర్ స్టో (26) ను జస్ ప్రీత్ బుమ్రా ఎల్బీ చేసి ఇంగ్లాండ్ ను కష్టాల్లోకి నెట్టాడు. దీంతో 194 పరుగులకే ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయింది.

పిచ్ స్పిన్‌కు అనూకులంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అశ్విన్ కు 3 వికెట్లు దక్కాయి. కులదీప్, అక్షర్ చెరో వికెట్ తీశారు. బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ , కీపర్ బెన్ ఫోక్స్ కాసేపు క్రీజులో నిలబడేందుకు ప్రయత్నించారు. అయితే అనూహ్యంగా కెప్టెన్ స్టోక్స్ (11) రన్ అవుట్ అయ్యాడు. దీంతో 220 పరుగుల వద్ద ఇంగ్లాండ్ 7 వ వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత 275 పరుగుల వద్ద ఫోక్స్ ( 36) బుమ్రాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ స్కోర్ 281 పరుగులు షోయబ్ బషీర్ ( 0) ముఖేశ్ కుమార్ బౌలింగ్ కీపర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 9వ వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో టామ్ హార్ట్లీ (36) చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

అశ్విన్ , బుమ్రా చెరో 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్నువిరిచారు. ముఖేశ్ కుమార్, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ గెలవడంతో సిరీస్ 1-1 సమంగా ఉంది. ఈ సిరీస్ లో ఇంకా మూడు టెస్టులు ఉన్నాయి. మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్ కోట్ గా వేదికగా జరగనుంది.

Related News

IND VS NZ: చెలరేగిన రచిన్ .. కివీస్ 402 పరుగులకు ఆలౌట్

Rishabh Pant: రిషబ్ పంత్ కోలుకోవడం కష్టమే.. సర్జరీ అయిన చోటే వాపు..?

Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

IPL 2025: సన్‌రైజర్స్‌కు డేల్ స్టెయిన్ గుడ్ బై !

Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

Ind vs Nz : చుక్కలు చూపించిన న్యూజిలాండ్‌…46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా..!

Ind Vs Nz: బెంగుళూరు టెస్ట్.. కష్టాల్లో టీమిండియా! 46 పరుగులకే ఆలౌట్

Big Stories

×